దేశంలో మహిళలు, చిన్నారులు అత్యాచారాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కామంతో కళ్లుమూసుకుపోయిన మృగాళ్లు విచక్షణ మరిచి మహిళలు, చిన్నారులపై దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్లో ఉమారియా జిల్లాలో ఓ 13 ఏళ్ల బాలిను మూడు సార్లు కిడ్నాప్ చేసి.. 9 మంది వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసుల కథనం.. జనవరి 4న బాధిత బాలికను తొలుత ఆమెకు తెలిసిన వ్యక్తి కిడ్నాప్ చేశాడు. ఆపై బాలికను రేప్ చేశాడు. అనంతరం అతని ఆరుగురు స్నేహితులు బాలికను గ్యాంగ్ రేప్ చేశారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని నిందితులు బాలికను బెదిరించారు. ఆ తర్వాత జనవరి 5వ తేదీన బాలికను వదిలిపెట్టారు. నిందితుల బెదిరింపులకు భయపడిన బాలిక ఈ విషయాన్ని ఎవరికి చెప్పలేదు.
అయితే ఆరు రోజుల తర్వాత మరోసారి ఇలానే జరిగింది. జనవరి 11న ఇంతకు మందు బాలికను రేప్ చేసిన ఏడుగురిలో ఒక వ్యక్తి ఆమెను కిడ్నాప్ చేశాడు. అనంతరం మొదట బాలికపై అత్యాచారినికి పాల్పడిన మరో ఇద్దరితో కలిసి ఆమెపై సాముహిక అత్యాచారం చేశాడు. ఆ తర్వాత వాళ్లు బాలికను విడిచిపెట్టారు. దీంతో బాలిక ఇంటిని బయలుదేరింది. అయితే అదే సమయంలో బాలికను అపహరించిన ఇద్దరు ట్రక్ డ్రైవర్లు ఆమెను రేప్ చేశారు. అయితే వారి వద్ద నుంచి తప్పించుకున్న బాలిక.. శుక్రవారం తెల్లవారుజామున ఇంటికి చేరింది.
అనంతరం తనపై జరిగిన పాశవిక దాడి గురించి కుటుంబసభ్యులకు తెలిపింది. దీంతోవారు కాట్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసినట్టు ఎస్పీ వికాస్ కుమార్ షాహ్వాల్ తెలిపారు.
మహిళలపై నేరాలకు వ్యతిరేకంగా అవగాహన తీసుకొచ్చేందకు శివరాజ్ సింగ్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సమ్మాన్ క్యాంపెయిన్ చేపట్టిన తరుణంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. గత వారం రోజుల వ్యవధిలో మధ్యప్రదేశ్లో వేర్వేరు ప్రాంతాల్లో ఇలాంటివి నాలుగు ఘటనలు చోటుచేవడం.. రాష్ట్రంలో మహిళ భద్రతపై ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి.
Published by:Sumanth Kanukula
First published:January 17, 2021, 12:04 IST