హోమ్ /వార్తలు /క్రైమ్ /

చంపుతానని బెదిరించి.. 13 ఏళ్ల బాలికపై ఆరు నెలలుగా అఘాయిత్యం.. తెలంగాణలో దారుణం

చంపుతానని బెదిరించి.. 13 ఏళ్ల బాలికపై ఆరు నెలలుగా అఘాయిత్యం.. తెలంగాణలో దారుణం

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

13 ఏళ్ల బాలికను చంపుతానని బెదిరిస్తూ ఓ దుర్మార్గుడు ఆరు నెలలుగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ బాలిక గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. నిత్యం ఎక్కడో చోట ఇలాంటి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. 13 ఏళ్ల బాలికను చంపుతానని బెదిరిస్తూ ఓ దుర్మార్గుడు ఆరు నెలలుగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ బాలిక గర్భం దాల్చడంతో విషయం బయటకు వచ్చింది. తనను చంపుతానని బెదిరించి నిందితుడు అనేక సార్లు తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పింది. నల్లగొండ జిల్లా నిడమనూరులో జరిగిన ఈ దారుణ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలగిరి సాగర్‌ మండలంలోని ఓ తండాకు చెందిన వ్యక్తి ఓ రైతు వద్ద మూడేళ్లుగా పని చేస్తున్నాడు.

ఆ రైతు ఇంటి సమీపంలోని ఓ గదిలో అతడు కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అయితే అతడి 13 ఏళ్ల కుమార్తె కడుపు నొప్పితో బాధపడుతుండడంతో చికిత్స నిమిత్తం మంగళవారం నిడమనూరులోని ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు బాలిక గర్భం దాల్చిందని నిర్ధారించడంతో తల్లిదండ్రులు షాక్ కు గురయ్యారు. ఈ విషయమై ఆ చిన్నారిని వారు అడగడంతో విషయం మొత్తం చెప్పింది.

ఏర్పుల రమేశ్‌(30) అనే వ్యక్తి  తనను చంపుతానని బెదిరించాడని వివరించింది. ఇలా బెదిరిస్తూ 6 నెలల నుంచి ఇంటికి అనేక సార్లు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెప్పింది. అయితే నిందితుడు బాధిత చిన్నారి పనిచేస్తున్న రైతు తమ్ముడి వద్ద గతంలో ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేశాడు. ఆ పరిచయంతోనే అతడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. నిందితుడికి వివాహం కావడంతో పాటు పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

First published:

Tags: Child rape, Nalgonda

ఉత్తమ కథలు