• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • 13 YEAR OLD BOY UNDRESSES 5 YEAR OLD GIRL TOUCHES HER INAPPROPRIATELY IN MADHYA PRADESH SU

షాకింగ్.. ఇంటి బయట ఆడుకుంటున్న బాలిక దుస్తులు తొలగించి.. అభ్యంతరకరంగా..

ప్రతీకాత్మక చిత్రం

ఓ 13 ఏళ్ల బాలుడు పాడుపనికి పాల్పడ్డాడు. 5 ఏళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులకు దిగాడు.

  • Share this:
    ఓ 13 ఏళ్ల బాలుడు పాడుపనికి పాల్పడ్డాడు. 5 ఏళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులకు దిగాడు. చిన్నారి బట్టలు తొలగించి.. అనుచితంగా తాకడం మొదలుపెట్టాడు. అయితే ఈ ఘటనపై బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. మైనర్ బాలుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌ నగరంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలుడు, బాలిక ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. అయితే బాలుడిపై శుక్రవారం బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలుడు వారి ఇంటికి సమీపంలో తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటాడని.. రెండు రోజుల క్రితం తన కూతురు ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో బట్టలు తీసేసి అనుచితంగా తాకాడని ఆమె పేర్కొంది.

    అదే సమయంలో బాలిక ఈ విషయాన్ని తనకు తెలియజేసిందని ఆమె పేర్కొంది. ఈ ఘటన జరిగిన సమయంలో కూలీ పనులు చేసే బాలుడి తల్లిదండ్రులు ఇంటివద్ద లేరని బాలిక తల్లి తెలిపింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు 13 ఏళ్ల మైనర్ బాలికపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణ సాగిస్తున్నట్టు చెప్పారు.

    ఇక, దేశంలో రోజురోజుకు చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు, దారుణాలు పెరిగిపోతూనే ఉన్నాయి. మహిళలు, చిన్నారులపై దారుణాలకు పాల్పడుతున్న వారిలో చాలా మంది వారికి తెలిసనవారు, సమీపంలో నివసించే వారు కావడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా సోకిన మహిళలపై ఒకటి రెండు చోట్ల కామాంధులు లైంగిక వేధింపులకు పాల్పడం.. తీవ్ర ఆందోళనకరమైన విషయమనే చెప్పాలి.
    Published by:Sumanth Kanukula
    First published: