ఖమ్మంలో దారుణం.. 13 రోజుల క్రితం అదృశ్యమై బాలుడి హత్య

ఈ క్రమంలో ఇంటిపక్కనే ఉన్న పాత ఇంట్లో ఆదివారం ఉదయం కుళ్లిపోయిన స్థితిలో ఓ శవం బయటపడింది. అది సాగర్‌ మృతదేహమేనని కుటుంబ సభ్యులు గుర్తించారు.

news18-telugu
Updated: August 25, 2019, 6:56 PM IST
ఖమ్మంలో దారుణం.. 13 రోజుల క్రితం అదృశ్యమై బాలుడి హత్య
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన 13 ఏళ్ల బాలుడు అనుమానాస్పద రీతిలో బావిలో శవమై కనిపించాడు. బొక్కల గడ్డలో ఈ ఘటన వెలుగుచూసింది. సాగర్‌ అనే బాలుడు నాలుగు రోజుల నుంచి కనిపించకుండాపోయాడు. గ్రామమంతా గాలించినా జాడ తెలియలేదు. బంధువుల కుర్రాడు కొండల్‌ (23) సాగర్‌ను మున్నేరులో తోసేశాడని తొలుత అనుమానించారు. ఈ క్రమంలో ఇంటిపక్కనే ఉన్న పాత ఇంట్లో ఆదివారం ఉదయం కుళ్లిపోయిన స్థితిలో ఓ శవం బయటపడింది. అది సాగర్‌ మృతదేహమేనని కుటుంబ సభ్యులు గుర్తించారు. సాగర్‌ను కొండల్‌ చంపేసి పాడుబడిన ఇంట్లో దాచిపెట్టాడని కుటుంబ సభ్యులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. నిందితుడు కొండల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు  ప్రారంభించారు.

First published: August 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు