విషాదం.. ఆన్‌లైన్ గేమ్స్‌లో మాయలో పడి తల్లి ఫోన్ ఇవ్వలేదని..

ఆన్‌లైన్ గేమ్స్‌ మాయలో పడి పచ్చిన జీవితాలను నాశనం చేసుకునే పరిస్థితులను కొని తెచ్చుకుంటున్నారు. కొంతమంది ఆన్‌లైన్ గేమ్స్ మాయలో రూ.లక్షలు ఇంట్లో తెలియకుండా ఖర్చు చేస్తుంటే.. మరికొంతమంది ప్రాణాలు తీసుకుంటున్నారు.

news18-telugu
Updated: July 15, 2020, 2:53 PM IST
విషాదం.. ఆన్‌లైన్ గేమ్స్‌లో మాయలో పడి తల్లి ఫోన్ ఇవ్వలేదని..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆన్‌లైన్ గేమ్స్.. అదో మాయ ప్రపంచం. గుక్క పట్టి ఏడ్చే పిలగాడైనా.. ఆన్‌లైన్ గేమ్స్ అనే మాట వినబడేదే ఆలస్యం .. చెవులు రిక్కరించి మరీ అటువైపు ఆసక్తి చూస్తుంటారు. స్మార్ట్ ఫోన్ల వాడకం పెరగడం.. అదే సమయంలో ఇంటర్ నెట్ సేవలు అందుబాటు ధరల్లోకి రావడంతో వీటి వినియోగం విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలోనే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలోనే మార్చి నుంచి సుదీర్ఘ కాలం పాటు సెలవులు వచ్చాయి. దీంతో విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు. ఇంటిలో చేసేదేం లేక చూస్తే టీవీ లేకుంటే.. స్మార్ట్ ఫోన్ వినియోగం అన్న చందంగా మారిపోయింది. ప్రధానంగా ఆన్‌లైన్ గేమ్స్ ఆడడం విద్యార్థులకు అలవాటుగా మారింది. ఈ ఆన్‌లైన్ గేమ్స్‌ మాయలో పడి పచ్చిన జీవితాలను నాశనం చేసుకునే పరిస్థితులను కొని తెచ్చుకుంటున్నారు. కొంతమంది ఆన్‌లైన్ గేమ్స్ మాయలో రూ.లక్షలు ఇంట్లో తెలియకుండా ఖర్చు చేస్తుంటే.. మరికొంతమంది ప్రాణాలు తీసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే ఓ విద్యార్థి తన తల్లి ఫోన్ వాడొద్దని చెప్పినందుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా పెద్దచెరుకూరు గ్రామానికి చెందిన ఓ బాలుడు ఏడో తరగతి చదువుతున్నాడు. కరోనా వైరస్ నేపథ్యంలో స్కూలు లేకపోవడంతో రోజూ సెల్‌ఫోన్‌తోనే గడిపేవాడు. అది కాస్త ఆ విద్యార్థికి అలవాటుగా మారింది. ఈ కమ్రంలో మంగళవారం సైతం రోజు మాదిరిగానే ఫోన్ ఇవ్వమని తల్లిని కోరాడు. దీంతో తల్లి ఫోన్ ఇవ్వకుండా చదువుకోవాలని మందలించింది.

అనంతరం ఏదో పని మీద ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. అయితే తన తల్లి స్మార్ట్ ఫోన్ ఇవ్వలేదన్న మనస్తాపంతో ఇంటిలోని రేకులకు తన తల్లి చీరతో ఉరి వేసుకున్నాడు. కొద్ది సేపటికే ఇంటికే వచ్చిన తల్లి తన కొడుకును పిలవగా ఏలాంటి సమాధానం బాలుడి నుంచి రాలేదు. దీంతో కిటికీ నుంచి లోపలికి తొంగి చూడగా, ఉరేసుకుని వేలాడుతూ కన్పించాడు. వెంటనే తల్లి స్థానికుల సహకారంతో తలుపులు పగలగొట్టి అతడిని కిందకు దించి ఆస్పత్రికి తరలించారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయాడని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Published by: Narsimha Badhini
First published: July 15, 2020, 2:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading