Home /News /crime /

13 LAKH FAKE CURRENCY SEIZED IN JAGITYALA DISTRICT OF TELANGANA SNR KNR

Fake Currency : జగిత్యాల జిల్లా ప్రజలు జర జాగ్రత్త ..మీకొచ్చే డబ్బుల్లో దొంగనోట్లు ఉన్నాయంట

(ఫేక్ కరెన్సీ పట్టివేత)

(ఫేక్ కరెన్సీ పట్టివేత)

Fake Currency:కరెన్సీ కల్తీ అవుతోంది. తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో చేతులు మారుతున్న నగదులో దొంగ నోట్లను కలిపి పంపిణి చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నలుగు నిందితుల నుంచి 13లక్షల ఫేక్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.

  (P.Srinivas,New18,Karimnagar)
  కరెన్సీ కల్తీ అవుతోంది. తెలంగాణ(Telangana)లో నకిలీ నోట్ల చెలామణి పట్టణాలు, జిల్లా కేంద్రాల్లో జోరుగా సాగుతోంది. సాదారణ వ్యక్తుల ముసుగులో కరెన్సీ నోట్ల ముఠా సభ్యులు దర్జాగా ఫేక్ కరెన్సీని క్యాష్‌గా మార్చుకుంటున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇదే విధంగా నకిలీ నోట్ల(Fake currency)ను జనానికి అంటగట్టేందుకు ప్రయత్నించిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కూపీ లాగితే నమ్మలేని నిజాలతో పాటు భారీగా నకిలీ నోట్ల పట్టుబడ్డాయి. జగిత్యాలjagityala జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్(New busstand)ప్రాంతంలో దొంగనోట్ల మార్పిడి జరుగుతున్నట్లుగా పోలీసు(Police)లకు సమాచారం అందింది. టౌన్ సీఐ కిషోర్(CI Kishore)రంగంలోకి దిగారు. నకిలీ నోట్ల ముఠాను రెడ్ హ్యాండెడ్‌(Red Handed)‌గా పట్టుకున్నారు.

  నకిలీ నోట్ల ముఠా ఆటకట్టు..
  జగిత్యాల కొత్త బస్టాండ్ ప్రాంతంలో మార్పిడి చేస్తుండగా పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఫేక్ కరెన్సీ చలామణి చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. వాళ్ల దగ్గర నుంచి 15 లక్షల రూపాయల విలువ చేసే 500 రూపాయల దొంగ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు మూడు లక్షల ఒరిజినల్ కరెన్సీ నోట్లు పోలీసులు రికవరీ చేసుకున్నారు. పట్టుబడిన ఫేక్ కరెన్సీ ముఠాపై కేసు నమోదు చేశారు. కరెన్సీ నోట్ల ముఠాకి చెందిన నలుగురు వ్యక్తుల్లో ఒకరు మంచిర్యాల జిల్లా దండపల్లి గ్రామానికి చెందిన శేఖర్, జన్నారానికి రాధాకిషన్ , గోదావరిఖని వాసి శ్రీనివాస్‌గౌడ్ , ఎల్కతుర్తికి చెందిన శ్రీకాంత్ బిక్షపతిగా గుర్తించారు. వీళ్లంతా గతంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపి ఆర్ధికంగా నష్టపోయారు. ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు దొంగ నోట్లను మార్పిడి చేసేందుకు సిద్ధపడ్డట్లుగా తెలుస్తోంది.

  13లక్షల దొంగనోట్లు స్వాధీనం..
  జగిత్యాలలో నకిలీ నోట్ల చలామణికి అనువైన ప్రదేశం. జిల్లాలో రవాణా సౌకర్యంతో పాటు వ్యాపార లావాదేవీలు ఎక్కువగా జరుగుతాయి. ముంబై, గోవాకు బస్, ట్రైన్ సౌకర్యం ఉండటం కారణంగానే దొంగ నోట్లు చలామణి జరుగుతున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అలాగే జగిత్యాల జిల్లాలో వస్త్ర వ్యాపారం, జూవెలరీ బిజినెస్‌ బాగా జరుగుతుండటం కారణంగానే ఈ ఫేక్ కరెన్సీ జోరుగా జరుగుతోందని  టౌన్ సీఐ కిషోర్ తెలిపారు.

  ఆరు నెలలుగా ఫేక్ నోట్ల చలామణి..
  పెద్ద నోట్ల రద్దు తర్వాత ఇలాంటి సంఘటనలు తెరపైకి రావడం జగిత్యాలలో కలకలం రేపుతోంది. ముఖ్యంగా వ్యాపారులతో పాటు స్థానికులు సైతం ఏవి అసలు నోట్లో, ఏవి దొంగనోట్లో గుర్తు పట్టలేక మోసపోతున్నామని భయపడుతున్నారు. పోలీసులు కూడా వ్యాపారులకు, స్థానికులను అలర్ట్ చేసారు. దొంగనోట్లు ఎవరైనా చలామణి చేస్తూ కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఏస్పీ సూచించారు.
  Published by:Siva Nanduri
  First published:

  Tags: Crime news, Jagityala, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు