హోమ్ /వార్తలు /క్రైమ్ /

కెనడాలో కాల్పులు... 13 మంది దుర్మరణం...

కెనడాలో కాల్పులు... 13 మంది దుర్మరణం...

కెనడాలో కాల్పులు... 13 మంది దుర్మరణం...  (credit - twitter - Waheed Faizi)

కెనడాలో కాల్పులు... 13 మంది దుర్మరణం... (credit - twitter - Waheed Faizi)

Canada Shooting Rampage : కెనడాలో 1989లో 14 మంది మహిళల్ని ఒకడు కాల్చి చంపడంతో... ఆ తర్వాత గన్ కంట్రోల్‌పై రూల్స్ కఠినతరం చేశారు.

Canada Shooting Rampage : అది కెనడాలోని నోవా స్కోషియా ప్రావిన్స్. అక్కడ ఓ వ్యక్తి పోలీస్ యూనిఫామ్‌లో వచ్చి... ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. ఈ దుర్ఘటనలో 13 మంది చనిపోయారు. కాల్పులు జరిపిన వ్యక్తి కూడా చనిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కెనడాలో 30 ఏళ్లలో జరిగిన అతి పెద్ద ఫైరింగ్ ఘటన ఇదే. చనిపోయిన వారిలో ఓ పోలీస్ ఆఫీసర్ కూడా ఉన్నారు. స్థానిక పోర్టాపిక్ రూరల్ టౌన్‌లోని ఓ ఇంటి లోపల, బయట... మృతదేహాలు పడివున్నాయి. రాత్రి ఘటన జరగ్గా... వెంటనే అలర్టైన పోలీసులు... ఆ చుట్టుపక్కల ఎవరూ బయటకు రావొద్దని ఆదేశించారు. ఆల్రెడీ ఆ ప్రాంతం మొత్తం లాక్‌డౌన్‌లో ఉండటం వల్ల ఎవరూ బయటకు రాలేదు.

ఈ ఘటన తర్వాత... దుండగుడు కొన్ని ఇళ్లకు నిప్పంటించినట్లు తెలిసింది. దుండగుణ్ని 51 ఏళ్ల షూటర్ గేబ్రియల్ వార్ట్‌మేన్‌గా భావిస్తున్నారు. తన కారును రాయల్ కెనడా మౌంటెడ్ పోలీస్ క్రూయిజర్ లా మార్చిన దుండగుడు... పోలీస్ యూనిఫామ్‌లో వచ్చినట్లు తెలిసింది.

దుండగుణ్ని ఓ గ్యాస్ స్టేషన్ దగ్గర అరెస్టు చేశామని ప్రకటించిన పోలీసులు... కొన్ని గంటల తర్వాత... అతను చనిపోయాడని తెలిపారు.

తాజా ఘటనలో దుండగుడు ఎందుకు కాల్చి చంపాడో ఇంకా పోలీసులకు తెలియలేదు. చనిపోయిన, గాయపడిన వారిలో చాలా మందికి ఆ దుండగుడు ఎవరో తెలియదని తెలిసింది.

కెనడాలో ఇలాంటి ఘటనలు చాలా అరుదు. ఆ దేశంలో 1989లో ఇలాగే 14 మంది మహిళల్ని ఒకడు కాల్చి చంపడంతో... ఆ తర్వాత గన్ కంట్రోల్‌పై రూల్స్ కఠినతరం చేశారు. కెనడాలో వ్యక్తులు గన్ లాంటివి కలిగివుండటం చట్ట విరుద్ధం. అమెరికాలో లాగా ఈజీగా గన్ లైసెన్స్ పొందే వీలు లేదు.

First published:

Tags: Canada, Gun fire

ఉత్తమ కథలు