123 కేజీల బంగారం స్వాధీనం... విలువ రూ.48 కోట్లు

Gold Scam : త్రిచూర్‌కి బంగారాన్ని ఎందుకు తరలించాలనుకున్నారు? అక్కడి నుంచీ ఆ గోల్డ్ ఎక్కడికి పంపాలనుకున్నారు. విదేశాలతో వాళ్లకున్న లింకులేంటి?

news18-telugu
Updated: October 18, 2019, 10:18 AM IST
123 కేజీల బంగారం స్వాధీనం... విలువ రూ.48 కోట్లు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Kerala Gold Scam : ఓవైపు గురువారం తమిళనాడులో కల్కి ఆశ్రమంపై దాడులు జరగగా... అదే సమయంలో... కేరళలోని త్రిచూర్ జిల్లాలో కస్టమ్స్ అధికారులు 123 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంత బంగారం ఎక్కడ, ఎలా దొరికిందన్న డౌట్ మనకు రావచ్చు. కేరళలో గోల్డ్ స్మగ్లింగ్ జరుగుతోందని ఎవరో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అవునా అంటూ పోలీసులు అలర్టయ్యారు. పక్కా ఆధారాలు లభించడంతో... కస్టమ్స్ అధికారులు ఒకేసారి జిల్లాలోని 23 ప్రాంతాల్లో దాడులు చేశారు. ఎక్కడికక్కడ బంగారాన్ని సీజ్ చేశారు. అసలేం జరిగిందంటే... తమిళనాడులో స్మగ్లర్లు ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా దొంగల నుంచీ బంగారం సేకరించడం మొదలుపెట్టారు. అలా సేకరించిన బంగారం ఎక్కువ మొత్తం అయ్యేవరకూ ఎవరికి వాళ్లు తమ దగ్గరే ఉంచున్నారు. ఇక ఇప్పుడు... దాన్ని రోడ్డు మార్గంలో... త్రిచూర్‌కి పంపాలని డిసైడయ్యారు. మొత్తం 17 మంది స్మగ్లర్లు... ఇలా బంగారాన్ని తరలిస్తుండగా... అధికారులకు దొరికిపోయారు.

బంగారం ఒక్కటే కాదు... రూ.2 కోట్ల క్యాష్, రూ.6.40 లక్షల విలువైన డాలర్ల నోట్లను సీజ్ చేశారు. ఇంతకీ వీళ్లు త్రిచూర్‌కే బంగారాన్ని ఎందుకు తరలించాలనుకున్నారు. అక్కడి నుంచీ ఆ గోల్డ్ ఎక్కడికి పంపాలనుకున్నారు. విదేశాలతో వాళ్లకున్న లింకులేంటి? ఇలాంటి అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

త్రిచూర్‌లో ఎయిర్‌పోర్ట్ లేదు. కానీ... అక్కడికి 50 కిలోమీటర్ల దూరంలో కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఉంది. అక్కడికి బంగారాన్ని తరలించి, విదేశాలకు పంపాలనుకున్నారా? లేక త్రిచూర్ నుంచీ దేశంలోని ఎక్కడికైనా గోల్డ్‌ని తరలించాలనుకున్నారా... వంటి విషయాలు తెలిస్తే... మనకు సస్పెన్స్ వీడుతుంది.


Pics : రాజు గారి గదిలో అందాల దెయ్యం అవికాగోర్ క్యూట్ ఫొటోస్


ఇవి కూడా చదవండి :


వావ్... చంద్రుడి అవతలివైపు ఫొటోతీసిన చంద్రయాన్-2Diabetes Tips : జామకాయలతో డయాబెటిస్‌కి చెక్... ఇలా చెయ్యండి

Health Tips : రోజా పూలతో చక్కటి ఆరోగ్యం... ఇలా చెయ్యండి


Health Tips : వేరుశనగ గింజలను ఇలా తింటే ఎక్కువ ప్రయోజనాలు

ఇంటికి ఎలాంటి కలర్స్ వేస్తే మంచిది... కలర్స్ ప్రభావం మనపై ఎలా ఉంటుంది?
Published by: Krishna Kumar N
First published: October 18, 2019, 10:18 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading