హోమ్ /వార్తలు /క్రైమ్ /

దారుణం: మైనర్ బాలికను రేప్ చేసి.. తర్వాత ఏం చేశాడంటే..

దారుణం: మైనర్ బాలికను రేప్ చేసి.. తర్వాత ఏం చేశాడంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ దారుణానికి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని భోపాల్ బీజేపీ అభ్యర్థి ప్రగ్యా సింగ్ ఠాకూర్ ఆరోపించారు.

    మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. 12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఓ దుర్మార్గుడు ఆ విషయం ఎక్కడైనా చెబుతుందన్న అనుమానంతో అతి కిరాతకంగా చంపేశాడు. ఈ ఘటన భోపాల్‌లో మంగళవారం సాయంత్రం జరిగింది. ఆ మైనర్ బాలిక తన ఆంటీతో కలిసి జైన్ టెంపుల్‌కు వెళ్లింది. అక్కడికి వచ్చిన అవినాష్ సాహు(18) అనే యువకుడు.. బాలిక ఆంటీ లేకుండా చూసి ఆమెను ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను దారుణంగా రేప్ చేశాడు. అయితే, ఈ విషయం బయటికి చెబితే ఏం అవుతుందోనన్న భయంతో అక్కడే ఉన్న బండ రాళ్లను తీసుకొని బాలిక తలపై మోది చంపేశాడు. తమ కుమార్తె కనిపించడం లేదని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా గాలింపు చేపట్టారు. ఓ చోట రక్తపు మడుగులో బాలిక శవం కనిపించింది. విచారణ చేపట్టగా అవినాష్ ఈ దారుణానికి పాల్పడ్డాడని తేలింది.


    ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో రాజకీయ సెగ పుట్టించింది.ఈ దారుణానికి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని భోపాల్ బీజేపీ అభ్యర్థి ప్రగ్యా సింగ్ ఠాకూర్ ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు విచ్ఛిన్నమయ్యాయని, బాలిక హత్యాచారానికి బదులు తీర్చుకుంటామని ట్వీట్ చేశారు.

    First published:

    Tags: Bhopal S12p19, Digvijaya Singh, Kamal Nath, Madhya pradesh, Madhya Pradesh Lok Sabha Elections 2019, RAPE, Save Girl Child

    ఉత్తమ కథలు