బాలికను రేప్ చేసిన టీచర్.. గర్భవతిని చేసి ఆపై..

Crime News: కామంతో కళ్లు మూసుకుపోయి 12 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడో టీచర్. తనకు జరిగిన అన్యాయాన్ని ఎవరికీ చెప్పుకోలేక కుంగిపోయిన ఆ విద్యార్థిని.. గర్భవతి కావడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

news18-telugu
Updated: August 26, 2019, 8:55 AM IST
బాలికను రేప్ చేసిన టీచర్.. గర్భవతిని చేసి ఆపై..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: August 26, 2019, 8:55 AM IST
విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే నీచంగా ప్రవర్తించాడు.. కామంతో కళ్లు మూసుకుపోయి 12 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తనకు జరిగిన అన్యాయాన్ని ఎవరికీ చెప్పుకోలేక కుంగిపోయిన ఆ విద్యార్థిని.. గర్భవతి కావడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కేరళలోని మలప్పురం జిల్లాలో చోటుచేసుకుందీ ఘటన. తెన్హిపాలెంలోని పాఠశాలలో బాలిక 7వ తరగతి చదువుతోంది. అదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న 30 ఏళ్ల వ్యక్తి ఆమెను రెండు నెలల పాటు రేప్ చేశాడు. అయితే, ఈ మధ్య ఆ బాలిక అనారోగ్యంతో ఉండటం.. తరచూ అలసటకు గురవుతుండటంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లడంతో అసలు విషయం బయటపడింది.

ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమె గర్భం దాల్చినట్లు తేలింది. దీంతో బాలికను ఏం జరిగిందని ప్రశ్నించగా ఆమె జరిగినంతా వివరించింది. ఘటనపై బాధిత బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

First published: August 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...