Home /News /crime /

12 YEAR OLD GIRL MOLESTED BY NEIBOUR HOUSE INTER STUDENT IN YADADRI BHONGIR DISTRICT OF TELANGANA NK

యాదాద్రిలో దారుణం... బాలికపై అత్యాచారం... ఇంటర్ విద్యార్థి ఘనకార్యం...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Yadadri Bhongir : పక్కింటి మైనర్ కుర్రాడు ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడతాడని ఎవరు మాత్రం ఊహిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో బాలికలకు రక్షణ లేనట్లేనా?

  Yadadri Bhongir : అత్యాచారం అనే దారుణం జరగకుండా... రోజు గడవట్లేదు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో రోజూ అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. అన్ని విషయాల్లోనూ ఎంతో పరిణతితో ఆలోచించే తెలుగు ప్రజలున్న తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటివి జరుగుతుంటే... ఇంకెలా?... యాదాద్రి భువన గిరి జిల్లాలో జరిగిందీ దారుణం. యాదగిరిగుట్ట మండలంలోని ఓ ఊరు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేది. పెద్దగా పోలీసులు అక్కడకు వెళ్లిన సందర్భాలు లేవు. అలాంటి చోట... శనివారం మాత్రం పోలీసులు రావడం... స్థానికులు ఏమైందా అని ఆశ్చర్యంగా చూడటం అన్నీ జరిగాయి. ఏమైందో తెలిశాక.. అందరూ ఆ కుర్రాణ్ని తిట్టిపోశారు... "నీకేం పోయేం కాలం వచ్చిందిరా గుంటడా" అంటూ మండిపడ్డారు.

  ఏం జరిగిందంటే... 12 ఏళ్ల ఆ బాలిక... తన కుటుంబంతో తప్ప వేరే ఎవరితోనూ పెద్దగా మాట్లాడేది కాదు. ఎప్పుడూ ఎక్కడకూ వెళ్లకుండా... ఇంట్లోనే ఉంటూ... తన చదువేదో తాను చదువుకుంటూ ఉండేది. అలాంటి ఆ పాప ఉండే ఇంటి పక్కనే మరో ఫ్యామిలీ ఉంది. అందులో ఇంటర్ చదివే విద్యార్థి ఉన్నాడు. చదువు కంటే ఆవారాతనం ఎక్కువైంది. ఇంట్లో వాళ్లు "కాళ్లిరగ్గొట్టి మూల కూర్చోబెడతాం" అని ఏనాడూ కంట్రోల్ చేసింది లేదు. ఫలితంగా గాలి వెధవలా తయారయ్యాడు. దానికితోడు... అతని ఫ్రెండ్స్ కూడా గాలోళ్లే. కాలేజీకి డుమ్మా కొడుతూ... అమ్మాయిల వెంట తిరిగిన పోకిరీలే. ప్రస్తుతం ఎగ్జామ్స్ టైమ్. బుద్ధిగా చదువుకోవాల్సిన టైమ్. ఇలాంటి సమయంలో... చెడు తిరుగుళ్లతో అడ్డమైన ఆలోచనలు పెంచుకున్న ఆ కుర్రాడు... పక్కింటి పాపపై కన్నేశాడు. కొన్ని రోజులుగా ఆ పాప కదలికల్ని గమనించడం మొదలుపెట్టాడు.

  తాజాగా దారుణం జరిగిన రోజున పాప ఇంట్లో ఎవరూ లేరు. తల్లిదండ్రులు పనిమీద బయటకు వెళ్లారు. ఇది గమనించిన కుర్రాడు... టీవీ రిమోట్ కావాలంటూ పాప ఇంటికి వెళ్లాడు. "మా ఇంట్లో రిమోట్ సరిగా పనిచెయ్యట్లేదు. ఓసారి నీ రిమోట్ ఇవ్వా" అన్నాడు. పక్కింటోడే కదా అని రిమోట్ ఇవ్వబోతుంటే... ఇంట్లోకి వచ్చి... తలుపు గడియవేసేశాడు. తలుపెందుకు వేస్తున్నావు అంటే... రిమోట్ తీసుకొని... పాప ఇంట్లోని టీవీ సౌండ్ (వాల్యూమ్) పెంచి... బాలిక నోరు నొక్కి అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది.

  అత్యాచారం తర్వాత... ఆ మైనర్ కుర్రాడు అక్కడి నుంచీ పారిపోయాడు. కాసేపటి తర్వాత ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు విషయం చెప్పి బోరున ఏడిందా బాధితురాలు. నివసిస్తున్న ఇంట్లోనే ఆ బాలికకు రక్షణ లేకుండా పోయింది. ఆ తల్లిదండ్రుల ఆవేదన అనంతసాగరమైంది. అగ్నిజ్వాలల్లా రగిలిపోతూ... వాళ్లు పాపను తీసుకొని పక్కింటికి వెళ్లారు. పక్కింట్లో కుర్రాడి తల్లిదండ్రులు ఆశ్చర్యంగా చూస్తుంటే... "మీ అబ్బాయెక్కడ" అని అడిగారు. కుర్రాడి తండ్రి... కుర్రాణ్ని పిలిచాడు. ఇంట్లో లేడని తెలిసింది. జరిగిన దారుణాన్ని కుర్రాడి తల్లిదండ్రులకి చెప్పిన బాలిక తల్లిదండ్రులు... మీ అబ్బాయిని వదిలే ప్రసక్తే లేదంటూ... పాపను తీసుకొని పోలీస్ స్టేషన్‌కి వెళ్లారు. కంప్లైంట్ రాసిన పోలీసులు... పాపను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి పంపారు. ఊరి చివర గుట్టల వెంట ఒంటరిగా తిరుగుతున్న కుర్రాణ్ని పట్టుకొని... అదుపులోకి తీసుకున్నారు. ఇలా... ఆ బాలికకు పక్కింటి మైనర్ కుర్రాడే శాపంగా మారడం అందర్నీ కలచివేసింది.
  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Molestation, Telangana News, Telugu news

  తదుపరి వార్తలు