వంటింట్లో పనిచేసుకుంటున్న తల్లి.. కుక్క పిల్లతో ఆడుకుంటున్న బాలిక.. అయ్యో పాపం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం..

ప్రతీకాత్మక చిత్రం

కొంత మంది ఇళ్లలో కుక్కలను పెంచుకుంటారు. వాటిని కుటుంబ సభ్యులలో ఒక్కరిగా భావిస్తారు. చాలా జాగ్రత్తగా వాటిని చూసుకుంటారు.

 • Share this:
  కొంత మంది ఇళ్లలో కుక్కలను పెంచుకుంటారు. వాటిని కుటుంబ సభ్యులలో ఒక్కరిగా భావిస్తారు. చాలా జాగ్రత్తగా వాటిని చూసుకుంటారు. ఆహారం విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటారు. అయితే అలాంటి ఓ ఇంట్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఇంట్లోని పెంపుడు కుక్కను ఎంతో ఇష్టపడే 12 ఏళ్ల బాలిక.. ఆ కుక్కను కాపాడబోయి ప్రాణాలు కోల్పోయింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) ఘజియాబాద్‌లో బుధవారం చోటుచేసుకుంది. ప్రాణాలు కోల్పోయిన బాలికను జ్యోత్స్నగా గుర్తించారు. వివరాలు.. ఘజియాబాద్‌లోని(Ghaziabad) గౌర్ హోమ్ హోసింగ్ సొసైటీలో లలిత్- కిరణ్ దంపతుల కుటుంబం తొమ్మిదో ఫ్లోర్‌లో నివాసం ఉంటుంది. లలిత్ ఓ ప్రైవేట్ కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. వారి కూతురు 12 ఏళ్ల జ్యోత్స్న ప్రస్తుతం 7వ తరగతి చదువుతోంది. బుధవారం మధ్యాహ్నం ఆమె తన పెంపుడు కుక్కతో కలిసి తన గదిలో ఆడుకుంటుంది. ఆ సమయంలో పెంపుడు కుక్క.. బాల్కనీ వైపు పరుగులు తీసింది. ఆ సమయంలో జ్యోత్స్న తల్లి కిరణ్.. వంటింట్లో తన పనులు చేసుకుంటూ ఉంది. తండ్రి లలిత్.. ఇంట్లో లేడు.

  4 నుంచి 5 నెలల వయసు ఉన్న ఆ కుక్క పిల్ల.. బాల్కనీలో ఉన్న నెట్‌లో చిక్కుకుంది. మధ్య చిక్కుకుంది. దీంతో జ్యోత్స్న కుక్క పిల్లను వెనక్కి లాగి కాపాడే యత్నం చేసింది. అయితే పెంపుడు కుక్క పిల్ల(Pet Dog) తల మాత్రం అందులో నుంచి బయటకు రావడం లేదు. ఈ క్రమంలోనే కుక్క పిల్లకు బయటకు తీసేందుకు ప్రయత్నించిన జ్యోత్స్న ప్రమాదవశాత్తు.. బాల్కనీ నుంచి కిందపడిపోయింది. ఒక్కసారిగా పెద్ద ఎత్తున శబ్దం రావడంతో అపార్ట్‌మెంట్‌లో వారంతా ఉలిక్కిపడ్డారు. బయట అరుపులు విన్న జ్యోత్స్న తల్లి బాల్కనీలోకి వచ్చి చూడగా.. కూతురు కింద రక్తపు మడుగులో పడి ఉంది. పెంపుడు కుక్క కూడా కిందపడి మృతిచెందింది.

  అనుమానం రాకుండా దందా.. ముఠాలో యువతులు కూడా.. ఇంతకీ వీరు ఏం చేస్తున్నారంటే..

  వెంటనే బాలికను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో బాలిక మృతిచెందింది. ఈ ఘటనతో జ్యోత్స్న కుటుంబం తీవ్ర విషాదంలో ఉందని కవి నగర్ పోలీస్ స్టేషన్(Kavi Nagar Police Station) ఎస్‌హెచ్‌వో సంజీవ్ శర్మ తెలిపారు. వారు పాప మృతదేహానికి పోస్ట్‌మార్టమ్ చేసేందుకు నిరాకరించారు.. అలాగే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కూడా చూడలేదు అని చెప్పారు. ప్రాథమిక విచారణ ప్రకారం ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందని తేలింది.

  ఈ ఘటనపై వారి ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు మాట్లాడుతూ.. పక్షులు ప్లాట్‌లోకి రాకుండా ఉండేందుకు బాల్కనీలో వలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. జ్యోత్స్న కుక్క పిల్లను చూసుకుంటున్న సమయంలో ఆమె తల్లి వంటింట్లో ఉందన్నారు. అయితే అరుపులు విని ఆమె బాల్కనీలోకి పరుగెత్తుకుని వచ్చేసరికి ఘోరం జరిగిపోయిందని అన్నారు. ఈ ఘటన బాలిక కుటుంబంతో పాటు, తమను షాక్‌లోకి నెట్టివేసిందని చెప్పారు.
  Published by:Sumanth Kanukula
  First published: