Home /News /crime /

12 YEAR OLD BOY HELD FOR RAPE AFTER GIRL 17 DELIVERS BABY IN TAMILNADU PVN

Rape : బిడ్డకు జన్మనిచ్చిన 17 ఏళ్ల బాలిక..12 ఏళ్ల బాలుడు అరెస్ట్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Rape On Minor : బాలికకు కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు ఏప్రిల్ 16న రాజా మిరాసుదార్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు పరీక్షించగా ఆమె తొమ్మిది నెలల గర్భవతి అని గుర్తించారు. అదే రోజు ఆ బాలిక ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

Rape On Minor : తమిళనాడులో 12 ఏళ్ల బాలుడు..17 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పలితంగా బాలిక ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ 12 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. గురువారం తంజావూరు ఆల్-మహిళా పోలీసు దళం 12 ఏళ్ల బాలుడిని లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం, 2012(POSCO Act)కింద ఆ బాలుడిని అరెస్టు చేసింది. అయితే బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా బాలుడిని అరెస్టు చేసినప్పటికీ, మరెవ్వరి ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరూ పాఠశాల మానేసిన విద్యార్థులు, ఒకే పరిసరాల్లో నివసిస్తున్నారు. బాలికకు కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు ఏప్రిల్ 16న రాజా మిరాసుదార్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు పరీక్షించగా ఆమె తొమ్మిది నెలల గర్భవతి అని గుర్తించారు. అదే రోజు ఆ బాలిక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆసుపత్రి సమాచారం మేరకు మహిళా పోలీసులు బాలికతో విచారణ చేపట్టారు. ఆమె ఇచ్చిన వివరాల మేరకు 12 ఏళ్ల బాలుడిపై పోక్సో చట్టం లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతం బాలుడిని తంజావూరులోని జువైనల్ హోంకు తరలించారు. పోలీస్ ఇన్‌స్పెక్టర్ రవిమతి మాట్లాడుతూ... బాలిక మరియు ఆమె తల్లిదండ్రులు బాలిక బిడ్డను ప్రసవించే వరకు ఆమె గర్భం గురించి తెలియకుండానే ఉన్నారని తెలిపారు. శాస్త్రీయ పద్ధతులు మరియు DNA పరీక్షను ఉపయోగించి బాలుడి వయస్సును నిర్ధారించాలని మేము నిర్ణయించుకున్నాము అని ఆమె తెలిపారు. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా బాలుడిని అరెస్టు చేసినప్పటికీ, మరెవ్వరి ప్రమేయం ఏమైనా ఉందా అని కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

ALSO READ Shocking : పెళ్లి చేసుకుందామనుకుంటే..డీజే సౌండ్ దెబ్బకు ప్రాణం పోయింది

మరోవైపు, ఓ యువతి తన ప్రియుడిపై కేసుపెట్టింది. అత్యాచారం చేసి గర్భవతిని చేశాడని పోలీసులకు పట్టించింది. కానీ ఇప్పుడదే యువతి అతడికి బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరుతోంది. అహ్మదాబాద్ నగరంలో ఈ కేసు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 2021 డిసెంబరు 31న ఓ యువతి తన ప్రియుడిపై కేసు పెట్టింది. తామిద్దరం ప్రేమించుకున్నామని.. పెళ్లి చేసుకుందామని అనుకున్నామని పోలీసులకు చెప్పింది. కానీ తాను గర్భం దాల్చగానే, అతడు మాట మార్చాడని వాపోయింది. తనను వదిలేసి కుటుంబంతో కలిసి సొంతూరికి వెళ్లిపోయాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం విచారణ ఖైదీగా జైల్లో ఉంటున్నాడు. ఐతే అతడిని జైలు నుంచి విడుదల చేయాలని అదే బాధితురాలు కోర్టుమెట్లెక్కింది. బాధితురాలు నిందితుడిపై కేసు పెట్టినప్పుడు ఆమె గర్భవతి. ఇప్పటికే ఆమెకు బిడ్డ పుట్టింది. కానీ తనను గర్భవతి చేసిన ప్రియుడు జైల్లో ఉన్నాడు. బిడ్డ పుట్టిన తర్వాత ఇరు కుటుంబాలకు పలు మార్లు చర్చలు జరిపాయి. ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించేందుకు ఇరు కుటుంబాలు అంగీకరించాయి. ఇప్పుడు అందరూ ఒప్పుకున్నా.. అంతా బాగానే ఉన్నా.. అతడు మాత్రం జైల్లో ఉన్నాడు. ఇదే ఇప్పుడు ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలోనే బాధిత యువతి మళ్లీ కోర్టు మెట్లెక్కింది. తాము ఇప్పుడు పెళ్లి చేసుకుంటామని, తన ప్రియుడికి బెయిల్ ఇవ్వాలని కోరింది. అతడు జైలు నుంచి విడుదలయితే..తన బిడ్డకు తండ్రి ప్రేమ కూడా దక్కుతుందని విజ్ఞప్తి చేసింది. ఇరు కుటుంబ సభ్యులు కూడా పెళ్లికి ఒప్పుకున్నారని.. జైలు నుంచి వచ్చిన వెంటనే పెళ్లి చేసుకుంటామని చెప్పింది. ఈ పిటిషన్‌పై అహ్మదాబాద్ సిటీ సివిల్ కోర్టు విచారించింది. ఐతే తీర్పును మాత్రం రిజర్వ్‌లో ఉంచింది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Minor girl raped, Rape case, Tamilnadu

తదుపరి వార్తలు