Home /News /crime /

12 YEAR OLD BHOPAL GIRL ALLEGEDLY BLACKMAILED RAPED NS

Bhopal Rape: పబ్జీ ఆటతో ఫ్రెండ్షిప్ చేసి.. 12 ఏళ్ల బాలికపై మగ్గురి అఘాయిత్యం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Bhopal Rape: భూపాల్ లో మరో దారుణం చోటు చేసుకుంది. 12 ఏళ్ల బాలికపై 18 నుంచి 19 ఏళ్ల వయస్సు ఉన్న ముగ్గురు దుర్మార్గులు అఘాయిత్యానికి పాల్పడ్డారు.

    దేశంలో మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ప్రభుత్వాలు, పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా కొందరు దుర్మార్గులకు భయం కలగడం లేదు. నిత్యం ఎక్కడో చోట అమ్మాయిలు, యువతులపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా భూపాల్ లో మరో దారుణం చోటు చేసుకుంది. 12 ఏళ్ల బాలికపై 18 నుంచి 19 ఏళ్ల వయస్సు ఉన్న ముగ్గురు వ్యక్తులు దారుణంగా అఘాయిత్యానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా తమ తాము చెప్పింది వినకపోతే ఆమె అసభ్యకర వీడియోను ఇంటర్ నెట్లో అప్ లోడ్ చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.

    స్థానిక పోలీస్ ఇన్ స్పెక్టర్ అలోక్ శ్రీ వాత్సవ తెలిపిన వివరాల ప్రకారం.. భూపాల్ లోని రంభానగర్ కు చెందిన 18 నుంచి 19 ఏళ్ల వయస్సు కలిగిన ముగ్గురు యువకులు ఆన్లైన్లో పబ్జీ ఆడే క్రమంలో 12 ఏళ్ల బాలికతో ఫ్రెండ్స్ అయ్యారు. సెప్టెంబర్ నెలలో ఆ ముగ్గురు యువకులు ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పి రంభానగర్ కు రప్పించారు. అక్కడ ఆమెపై దారుణంగా అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ సమయంలో వారు వీడియో చిత్రీకరించారు. అనంతరం ఆ వీడియోను ఇంటర్ నెట్లో పెడతామంటూ బెదిరించి.. అనేక సార్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితులను గుర్తించి అరెస్టు చేశారు.

    ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లోనూ మరో ఘోరం చోటు చేసుకుంది. కొన్ని రోజుల క్రితం అక్కడ 19 ఏళ్ల యువతిపై కొందరు దుండగులు అఘాయిత్యానికి పాల్పడిన దారుణ ఘటనతో దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని దేశం మరవక ముందే అక్కడ మంగళవారం మరో దారుణం జరిగింది. నాలుగేళ్ల చిన్నారిపై ఆమె బంధువే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వివరాల ప్రకారం.. ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలికను అరవింద్ అనే వ్యక్తి తీసుకెళ్లాడు. అనంతరం ఆ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే సాయంత్రం సమయంలో బాలికను గమనించిన తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. దీంతో వారు ఆ బాలికను స్థానిక వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆ చిన్నారి రేప్ కు గురైందని నిర్ధారించారు. బాలిక మావయ్య ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Crime news, Madya pradesh, Minor rape

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు