Home /News /crime /

12 GIRLS HAVE BEEN ARRESTED IN HARYANA FOR ENGAGING IN PROSTITUTION IN THE NAME OF MASSAGE CENTERE SNR

స్పా సెంటర్‌లో పట్టుబడ్డ 12మంది అమ్మాయిలు..లోపల ఏం చేస్తున్నారో తెలుసా

Photo Credit:Youtube

Photo Credit:Youtube

Sex Racket: హర్యానా కర్నాల్‌లో మసాజ్‌ సెంటర్‌లలో జరుగుతున్న చీకటి దందాను పోలీసులు గుట్టురట్టు చేశారు. స్పా పేరుతో లోపల అమ్మాయిలతో అసాంఘీక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించి 16మందిని అరెస్ట్ చేశారు.

హర్యానాలో స్పా సెంటర్‌ పేరుతో పబ్లిక్‌గా సాగుతున్న అసాంఘీక కార్యకలాపాలను బయటపెట్టారు అక్కడి పోలీసులు. మసాజ్‌ సెంటర్‌ల పేరుతో ఒక్కో షాపింగ్‌ కాంప్లెక్స్‌లో మూడు, నాలుగు స్పా సెంటర్‌లు ఓపెన్ చేసి సెక్స్‌ రాకెట్ నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు నిర్ధారించారు. పక్కా సమాచారంతో స్పా సెంటర్‌లపై రైడ్ చేసిన పోలీసులు మసక మసక చీకటిలో జరుగుతున్న మురికి వ్యాపారాన్ని బయటపెట్టారు. హర్యానా haryanaరాష్ట్రం కర్నాల్‌ (Karnal)నగరంలో సెక్టార్‌ 12లోని సూపర్‌ మాల్‌లో క్యూ2 స్పా(Q2 spa), క్లాసిక్ థాయ్‌ స్పా(Clasic thai spa), ద రాయల్‌ థాయ్‌ స్పా(The royal thai spa)పేర్లతో నిర్వహిస్తున్న మూడు మసాజ్‌ సెంటర్‌లపై పోలీసులు తనిఖీలు చేశారు. బయట స్పా అనే పేరుతో బోర్డులు పెట్టి లోపల అమ్మాయిలతో సెక్స్‌ రాకెట్ (Prostitution)నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు. మూడు స్పా సెంటర్‌లపై ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. 12 మంది బాలికల(12 Girls)తో పాటు నలుగురు యువకులు (4 Youth)లోపల శృంగారం చేస్తుండగా పట్టుకున్నారు. కర్నాల్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్న 16మందితో పాటు స్పా నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.

మసాజ్‌ సెంటర్‌లో మురిసి యాపారం..
స్పా సెంటర్‌ల లోపలికి వెళ్లిన పోలీసులు లోపల దొరికిన వస్తువులు చూసి షాకయ్యారు. మసాజ్‌ సెంటర్‌లలో మద్యం సీసాలు, కండోమ్ ప్యాకెట్లు, సిగరెట్‌ ప్యాకెట్లతో పాటు యువతి, యువకుల లోదుస్తులు మరికొన్ని అభ్యంతరకర వస్తువులను గుర్తించారు. సూపర్‌ మాల్ పబ్లిక్ ప్లేసులో ఉండటంతో ఎవరి అనుమానం రాదు, పోలీసులు రైడ్ చేయరనే ధైర్యంతోనే స్పా, మసాజ్‌ సెంటర్‌ల పేరుతో అసాంఘీక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లుగా పోలీసుల విచారణలో తేల్చారు.
కండోమ్స్, మందు బాటిళ్లు స్వాధీనం..

మసాజ్ సెంటర్‌ల పేరుతో డర్టీ పనులు చేస్తున్న నిర్వాహకులు, లోపల పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేశారు. అందర్ని కోర్టులో హాజరుపరిచారు. వ్యభిచారం నిర్వహిస్తూ రెడ్‌ హ్యాండెడ్‌గా పోలీసులకు దొరికిపోవడంతో అక్కడి నుంచి వాళ్లను జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. నగరంలోని సూపర్‌ మాల్‌ని అడ్డాగా చేసుకొని ఇంత పెద్ద సెక్స్‌రాకెట్‌ జరుగుతుందని పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికి పట్టించుకోలేదని స్థానికులు కొందరు ఆరోపిస్తున్నారు. స్పా, మసాజ్‌ సెంటర్‌లపై పోలీసులు అనుక్షణం నిఘా పెట్టాలని కోరుతున్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Haryana, Sex Racket

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు