మేకలు కాసే బాలికపై లైంగిక దాడి.. నెల్లూరులో దారుణం

అదే గ్రామానికి చెందిన 35 ఏళ్ల వ్యక్తి బాలికకు ఫోన్‌లో బూతు వీడియోలు చూపించి.. అనంతరం లైంగిక దాడికి పాల్పడ్డాడు

news18-telugu
Updated: July 14, 2020, 10:51 PM IST
మేకలు కాసే బాలికపై లైంగిక దాడి.. నెల్లూరులో దారుణం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మేకలు కాసే బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడో దుండుగుడు. కూతురు వరసయ్యే ఆ చిన్నారి పట్ల దారుణంగా ప్రవర్తించాడు. నెల్లూరు జిల్లా కావలి మండలం బసవరాజు పాలెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 11 ఏళ్ల ఓ బాలిక మేకలు మేపుతూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటోంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం కూడా మేకలను మేపేందుకు పొలాల్లోకి వెళ్లింది. ఐతే అదే గ్రామానికి చెందిన 35 ఏళ్ల వ్యక్తి బాలికకు ఫోన్‌లో బూతు వీడియోలు చూపించి.. అనంతరం లైంగిక దాడికి పాల్పడ్డాడు.

అతడి నుంచి తప్పించుకొని ఇంటికి వెళ్లిన బాలిక.. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి కన్నీరు పెట్టుకుంది. తమ కూతురి పట్ల ఆ కామాంధుడు ప్రవర్తించిన తీరుపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన పట్ల మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. బాధితురాలికి న్యాయం చేసి.. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి.
Published by: Shiva Kumar Addula
First published: July 14, 2020, 10:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading