కన్న కూతురినే రేప్ చేసిన కామాందుడు.. దేశంలో మరో దారుణం

దేశంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. కామంతో క‌ళ్లు మూసుకుపోయిన ఓ కీచక తండ్రి తన 11 ఏళ్ల కూతురుపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తన భార్య ఊరికి వెళ్లిన సమయంలో ఈ దారుణానికి ఒడిగట్టాడు. దీంతో ఆ బాలిక తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లింది.

news18-telugu
Updated: November 12, 2020, 2:17 PM IST
కన్న కూతురినే రేప్ చేసిన కామాందుడు.. దేశంలో మరో దారుణం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. వావివరుసలు మరిచిన కొందరు కామాందులు చెల్లి, కూతుళ్లపై సైతం దారుణాలకు పాల్పడుతున్నారు. దేశంలో ఇలాంటి ఘటనలు ఇటీవల అధికంగా జరుగుతుండడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. తాజాగా గుజరాత్ లో ఇలాంటి దారుణ ఘటన చోటు చేసుకుంది. కామంతో క‌ళ్లు మూసుకుపోయిన ఓ తండ్రి తన 11 ఏళ్ల కూతురుపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తన భార్య ఊరికి వెళ్లిన సమయంలో ఈ దారుణానికి ఒడిగట్టాడు. దీంతో ఆ బాలిక తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది.

వివరాల ప్రకారం.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ రాష్ట్రానికి చెందిన భార్యాభర్తలు బ‌తుకుదెరువు కోసం గుజరాత్ రాష్ట్రంలోని జామ్‌న‌గ‌ర్ జిల్లాలోని త‌లానాకు కొన్నేళ్ల క్రితం వలస వచ్చారు. ఆ దంపతులకు 11 ఏళ్ల బాలిక ఉంది. అయితే ఈ నెల 1న బాలిక తల్లి పనిపై వారి సొంత ప్రాంతం మధ్యప్రదేశ్ కు వెళ్లింది. అయితే కూతురుపైనే కన్నేసిన ఆ కీచక తండ్రి.. ఈ సమయాన్ని అదునుగా మార్చుకున్నాడు. ఆ చిన్నారిపై రెండు సార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

దీంతో షాక్ కు గురైన బాలిక డిప్రెషన్ లోకి వెళ్లి పోయింది. కొన్ని రోజుల తర్వాత ఇంటికి వచ్చిన తల్లి తన కూతురు డిప్రెషన్ లోకి వెళ్లిన విషయాన్ని గుర్తించింది. ఈ క్రమంలో ఏం జరిగిందని కూతురును ప్రశ్నించగా జరిగిన విషయం మొత్తం చెప్పింది. దీంతో బాధిత చిన్నారి త‌ల్లి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆ కామాందుడిని కటకటాల వెనక్కి నెట్టారు.
Published by: Nikhil Kumar S
First published: November 12, 2020, 2:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading