అమెరికా పిట్స్‌బర్గ్ కాల్పుల్లో 11 మంది మృతి.. నిందితుడి అరెస్ట్

కాల్పులకు పాల్పడిన వ్యక్తి 46 ఏళ్ల రాబర్ట్ బోయర్స్‌గా గుర్తించారు. కాల్పులు జరుపుతూ అతడు‘యూదులందరూ చనిపోవాల్సిందే’ అని నినాదాలు చేశాడన్నారు పోలీసులు.

news18-telugu
Updated: October 28, 2018, 1:15 PM IST
అమెరికా పిట్స్‌బర్గ్ కాల్పుల్లో 11 మంది మృతి.. నిందితుడి అరెస్ట్
అమెరికాలో కాల్పులు, 11 మంది మృతి
  • Share this:
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. పీట్స్‌బర్గ్‌లోని యూదుల ప్రార్థన మందిరంలో ఓ వ్యక్తి విచక్షణా రహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. ఆరుగురు గాయపడ్డారు. పలువురు ఉదయం ప్రార్థనలు నిర్వహిస్తున్న సమయంలో ఓ ముష్కరుడు చొరబడి కాల్పులు జరిపాడు. సెమీ ఆటో మెటిక్ రైఫిల్‌తో కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితునిపై ఎదురుకాల్పులు జరిపారు. బుల్లెట్‌ గాయాలైన నిందితున్ని అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు. ఈ కాల్పుల్లో నలుగురు పోలీసులకు కూడా గాయాలయ్యాయి.

కాల్పులకు పాల్పడిన వ్యక్తి 46 ఏళ్ల రాబర్ట్ బోయర్స్‌గా గుర్తించారు. కాల్పులు జరుపుతూ అతడు‘యూదులందరూ చనిపోవాల్సిందే’ అని నినాదాలు చేశాడన్నారు పోలీసులు. దీంతో అతనిపై విద్వేషపూరిత దాడి, మరణశిక్ష పడే ఇతర ఫెడరల్‌ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లుగా తెలిపారు. అతని వద్ద నుంచి సెమీఆటోమెటిక్‌ రైఫిల్‌తోపాటు మరో మూడు హ్యాండ్‌గన్లను స్వాధీనం చేసుకున్నారు. కాల్పులకు ముందు రాబర్ట్ సోషల్ మీడియాలో యూదులకు వ్యతిరేకంగా పోస్టులు చేసినట్లు తెలిసింది.
Published by: Sulthana Begum Shaik
First published: October 28, 2018, 1:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading