హోమ్ /వార్తలు /క్రైమ్ /

Siddipet : పసిపాప కాలిగజ్జెలకు కరెంట్ షాక్ పెట్టి.. కన్నతండ్రి క్రూరత్వం.. భార్యపై అనుమానంతో ఇలా..

Siddipet : పసిపాప కాలిగజ్జెలకు కరెంట్ షాక్ పెట్టి.. కన్నతండ్రి క్రూరత్వం.. భార్యపై అనుమానంతో ఇలా..

చనిపోయిన ప్రిన్సీ, తల్లి సునీత, నిదితుడు రాజశేఖర్ (photo credit eenadu)

చనిపోయిన ప్రిన్సీ, తల్లి సునీత, నిదితుడు రాజశేఖర్ (photo credit eenadu)

భార్యపై కోపంతో బిడ్డను తీసుకొని పొలం దగ్గరికొచ్చిన రాజశేఖర్.. అక్కడ ప్రిన్సీ కాళ్ల పట్టీల గజ్జెలకు తీగలు చుట్టి కరెంటు మోటర్ స్టార్టర్ ద్వారా షాకిచ్చాడు. త్రీఫేజ్ హైవోల్టేజీ కరెంటు షాక్ ధాటికి పసిపాప కిక్కురుమనకుండా క్షణంలోనే ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత రాజశేఖర్ అక్కడే పురుగుల మందు తాగాడు. మరో రైతుకు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్న విషయం చెప్పాడు. దీంతో..

ఇంకా చదవండి ...

దంపతుల్లో ఒకరిపై ఒకరికుండే కోపతాపాలకు పిల్లలు బలైపోతున్న ఉదంతాలు ఇటీవల పెరుగుతున్నాయి. నాకు దక్కనిది ఎవరికీ దక్కొద్దనే అక్కసుతోనో.. పిల్లలు లేకుండా చేస్తే అవతలివారికి సరైన శిక్షగానో భావించి తీవ్ర చర్యలకు ఒడిగడుతుంటం ఆందోళన కలిగిస్తున్నది. భార్తతో గొడవపడ్డ భార్యలు లేదా భార్యపై అనుమానం పెంచుకున్న భార్తలు పిల్లలనూ బలవంతంగా చంపేస్తుండటం సాధారణ చర్యనా? అన్నట్లుగా పరిస్థితి మారింది. సిద్దిపేట జిల్లాలో తాజాగా వెలుగు చూసిన ఉదంతంలోనూ ఓ వ్యక్తి తన భార్యపై అనుమానంతో ఆత్మహత్యకు యత్నించాడు.. కానీ తనతోపాటే 11 నెలల పసిపానను తీసుకెళ్లడం ద్వారా భార్యకు సరైన శిక్ష వేయాలనుకున్నాడు. అతి కిరాతకంగా పసిపాప కాలి పట్టీల గజ్జెలకు కరెంట్ షాక్ పెట్టి చంపేసి, ఆ తర్వాత తానూ పురుగులమందు తాగాడు. పొలంలో ఆత్మహత్య చేసుకున్న విషయం పొరుగురైతుకు ఫోన్ చేసి చెప్పాడు. ఈ కేసుకు సంబంధించి తోగుట పోలీసులు చెప్పిన వివరాలివి..

సిద్దిపేట జిల్లా తోగుట మండలం వెకట్రావుపేటలో శుక్రవారం దారుణం జరిగింది. గ్రామానికి చెందిన రాజశేఖర్ అనే వ్యక్తికి దౌల్తాబాద్ కు చెందిన సునీతతో రెండేళ్ల కిందట వివాహం అయింది. కొంతకాలంపాటు కాపురం సజావుగా సాగి, ఆడపిల్ల పుట్టింది. ఆ తర్వాత ఏమైందోగానీ సునీతపై భర్త రాజశేఖర్, అతని తల్లిదండ్రులు నర్సవ్వ, యాదయ్య, చెల్లెలు సౌందర్య అనుమానం వ్యక్తం చేస్తూ కొట్టడం మొదలుపెట్టారు. నీకు ఎవరితోనూ సంబంధం ఉందని ఆరోపిస్తూ సునీతతో నిత్యం తగువులాడటం అత్తింటి కుటుంబానికి అలవాటైంది. ఈక్రమంలో కుల పెద్దలు జోక్యం చేసుకుని సునీత-రాజశేఖర్ లతో వేరు కాపురం పెట్టించారు.

తన వాడొస్తాడని ఇంట్లో వాళ్లకు దీమాగా చెప్పింది.. తీరా వాడు మోసం చేశాక.. ముఖం చూపించలేక..



రాజశేఖర్, సునీత దంపుతులు తమ పాప ప్రిన్సీ(11 నెలలు)తో ఊర్లోనే వేరే ఇంట్లో అద్దెకుంటున్నారు. కొద్ది రోజులుగా మనసు మార్చుకున్న రాజశేఖర్.. తల్లిదండ్రులతోనే కలిసుండాలని నిర్ణయించుకున్నాడు. అదే విషయమై భార్య సునీతతో గట్టిగా గొడవ పెట్టుకున్నాడు. నిన్న శుక్రవారం కూడా భార్యను తిట్టి, కొట్టి, ఆ ఉక్రోషంలో కూతురు ప్రిన్సీ(11 నెలలు)ని ఎత్తుకుని తాను కౌలు చేసే పొలం దగ్గరికి వెళ్లాడు. వ్యవసాయ బోరు బావికి ఉండే కరెంటు తీగలను..

అసలైన తెలంగాణ ఇంకా రాలేదు.. మరో పోరాటానికి సిద్దం : Etela Rajender సంచలన వ్యాఖ్యలు



భార్యపై కోపంతో బిడ్డను తీసుకొని పొలం దగ్గరికొచ్చిన రాజశేఖర్.. అక్కడ ప్రిన్సీ కాళ్ల పట్టీల గజ్జెలకు తీగలు చుట్టి కరెంటు మోటర్ స్టార్టర్ ద్వారా షాకిచ్చాడు. త్రీఫేజ్ హైవోల్టేజీ కరెంటు షాక్ ధాటికి పసిపాప కిక్కురుమనకుండా క్షణంలోనే ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత రాజశేఖర్ అక్కడే పురుగుల మందు తాగాడు. మరో రైతుకు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్న విషయం చెప్పాడు. ఆ రైతు రాజశేఖర్ కుటుంబీకులు, ఇతర గ్రామస్తులకు సమాచారం అందించడంతో అందరూ కలిసి ఘటనాస్థలికి చేరుకున్నారు.

Suryapet : కూతురు అలా మంచంపై ఉండగా తల్లిని కామ కోరిక తీర్చమన్నాడు.. ఆ రాత్రి జరిగింది చూసి తట్టుకోలేక..



కరెంట్ షాక్ తో మాడిమసైపోయిన పసికందు పాదాలను, కాలిగజ్జెలకు కట్టున్న కరెంటు తీగలను చూసి తల్లి సునీత గుండెలు బాదుకుంటూ రోదించింది. పసిపాను తండ్రి చంపేసిన వైనాన్నిచూసి ఊళ్లోవాళ్లంతా విస్తుపోయారు. పురుగుల మందుతాగి పడిపోయిన రాజశేఖర్ ను చికిత్స కోసం ముగులు ఆర్వీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తోగుట పోలీసులు తెలిపారు.

First published:

Tags: Siddipeta, Telangana, Telangana crime news

ఉత్తమ కథలు