హోమ్ /వార్తలు /క్రైమ్ /

Road Accident: పండగ పూట తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో 11 మంది మృతి.. పశువులను తప్పించబోయి..

Road Accident: పండగ పూట తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో 11 మంది మృతి.. పశువులను తప్పించబోయి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పండగ పూట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడిన ఘటనలో అందులో ప్రయాణిస్తున్న 11 మంది మృతిచెందారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు.

పండగ పూట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడిన ఘటనలో అందులో ప్రయాణిస్తున్న 11 మంది మృతిచెందారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) ఝాన్సీ జిల్లాలో (Jhansi District) చోటుచేసుకుంది. ఝాన్సీలోని చిర్‌గావ్ ప్రాంతంలోని భందర్ రోడ్డులో (Bhander Road in the Chirgaon area) ఈ ప్రమాదం జరిగిందని సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ శివహరి మీనా (Shivhari Meena) పీటీఐ వార్త సంస్థకు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో ట్రాక్టర్ ట్రాలీలో 30 కుటుంబాలకు చెందిన వ్యక్తులు ఉన్నారు. మధ్యప్రదేశ్‌లోని పండోఖర్‌కు చెందిన వీరు ట్రాక్టర్‌లో ఎరాచ్‌లోని దేవాలయానికి వెళ్తున్నారు. అయితే వీరు ప్రయాణిస్తున్న మార్గంలో పశువులు అడ్డుగా రావడంతో.. వాటిని ఢీకొట్టకుండా ఉండేందుకు ట్రాక్టర్ డ్రైవర్ ఆకస్మాత్తుగా బ్రేకులు వేశాడు. దీంతో ట్రాక్టర్ ట్రాలీ రోడ్డు పక్కన బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే మరణించగా, మరికొందరికి గాయాలయ్యాయి. గాయపడినవారిలో ఆరుగురిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మృతుల్లో నలుగురు పిల్లలు, ఏడుగురు మహిళలు ఉన్నారని పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఆ కారణంతో భార్యను ఇంట్లోకి అనుమతించని భర్త.. చెరువులోకి దూకేశాడు.. చివరకు ఏం జరిగిందంటే..


ఇక, ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులకు అవసరమైన సహాయం అందించాలని ఆయన జిల్లా అధికారులను ఆదేశించారు.

First published:

Tags: Road accident, Uttar pradesh

ఉత్తమ కథలు