Home /News /crime /

11 KILLED IN GAS CYLINDER EXPLOSION IN UTTAR PRADESHS MAU DISTRICT SB

ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్.... 11 మంది ‌మృతి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఓ ఇంట్లోని గ్యాస్ సిలిండర్ ప్రమాదవశాత్తు పేలింది. దీంతో ఒక్కసారిగా రెండంతస్థుల భవనం కుప్పకూలిపోయింది.

    ఉత్తర్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ దుర్ఘటనలో పదిమంది ప్రాణాలు పోగుట్టుకున్నారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మొహమ్మదాబాద్‌లోని ఓ ఇంట్లోని గ్యాస్ సిలిండర్ ప్రమాదవశాత్తు పేలింది.

    దీంతో  రెండంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ కారణంగానే మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగిస్తున్నారు.ఈ ఘటనలో గాయపడ్డ మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

    ఇవికూడా చూడండి:
    జపాన్‌ను వణికిస్తున్న హగిబిస్ తుఫాను

    First published:

    Tags: BLAST, LPG Cylinder, Uttar pradesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు