కుప్పంలో దారుణం.. బాలికపై టెన్త్ విద్యార్థి అత్యాచారం

నిందితుడు వరుణ్‌ని స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.


Updated: December 16, 2019, 8:14 PM IST
కుప్పంలో దారుణం.. బాలికపై టెన్త్ విద్యార్థి అత్యాచారం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దిశ నిందితులను ఎన్‌కౌంటర్ చేసినా.. దిశ చట్టం వంటి కఠిన చట్టాలు వచ్చినా.. కామాంధుల్లో మార్పు రావడం లేదు. దేశంలో నిత్యం ఏదో ఒక చోట అత్యాచర ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఏపీలో మరో ఘోరం వెలుగులకి వచ్చింది. చిత్తూరు జిల్లా కుప్పంలో పదేళ్ల మైనర్ బాలికపై పదో తరగతి విద్యార్థి అత్యాచారం చేశాడు. కుప్పం రైల్వే స్టేషన్‌ సమీపంలో ఈ ఘటన జరిగింది. నిందితుడు వరుణ్‌ని స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఏపీలో ఇటీవలే దిశ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం మహిళలపై అత్యాచారం చేసినట్లు రుజువైతే ఉరి శిక్ష విధిస్తారు. నేరాన్ని నిర్ధారించే ఆధారాలున్నప్పుడు 21 రోజుల్లో తీర్పు వెల్లడిస్తారు. వారంరోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేసి.. మరో 14 రోజుల్లో విచారణ పూర్తి చేస్తారు. మొత్తం 21 రోజుల్లో రేప్‌ కేసుపై జడ్జిమెంట్‌ వస్తుంది. ప్రస్తుతం ఉన్న 4 నెలల విచారణ సమయాన్ని 21 రోజులకు కుదిస్తూ చట్టం రూపొందించారు. ఇక మహిళలు, చిన్నారులపై అత్యాచారం, సామూహిక అత్యాచారం, యాసిడ్‌ దాడులు, వేధింపులు, లైంగిక వేధింపులు తదితర నేరాలకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టుల ఏర్పాటు చేస్తున్నారు.
First published: December 16, 2019, 8:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading