అక్క మొగుడే కామాంధుడిగా మారి.. పదో తరగతి చదువుతున్న మరదలిని..

అయ్యప్పన్ భార్యకు ఓ చెల్లి కూడా ఉంది. ఆమెకు 10వ తరగతి చదువుతోంది. అతనిపై అయ్యప్పన్ కన్నుపడింది. మరదలిని బెదిరించాడు.

news18-telugu
Updated: June 14, 2019, 8:39 AM IST
అక్క మొగుడే కామాంధుడిగా మారి.. పదో తరగతి చదువుతున్న మరదలిని..
14 ఏళ్ల కూతురిపై కన్నతండ్రి అత్యాచారం... తర్వాత పశ్చాతాపంతో
news18-telugu
Updated: June 14, 2019, 8:39 AM IST
పదో తరగతి చదువుతున్న ఆ బాలికకు అక్క మొగుడే... వేధింపులకు గురి చేశాడు. బావ బుద్ది చూపించాడు. అన్నెం పున్నెం తెలియని అమ్మాయిని బెదిరించి పలుసార్లు అత్యాచారం చేశాడు. ఇలా ఆరేళ్లుగా బాలికపై తన పైశాచికం ప్రదర్శించాడు. చివరకు బాలిక గర్భవతి కావడంతో వెంటనే ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ప్రియుడు ఆమెను గర్భవతిని చేశాడని... వెంటనే అబార్షన్ చేయాలని డాక్టర్లకు చెప్పాడు. దీంతో అతడి వ్యవహారం పట్ల వైద్యులకు అనుమానం వచ్చింద. దీంతో డాక్టర్లు వెంటనే మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న బావ అక్కడ్నుంచి సైలెంట్‌గా పరారయ్యాడు. ఈ ఘటన తమిళనాడు కన్యాకుమారి జిల్లాలో చోటు చేసుకుంది.

కన్యాకుమారి జిల్లా కురుత్తన్ గోడు సమీపంలో ఉన్న ఓగ్రామానికి చెందిన అయ్యప్పన్‌కు 30 ఏళ్లు. భవన నిర్మాణ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఐదేళ్ల క్రితం ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అయ్యప్పన్ భార్యకు ఓ చెల్లి కూడా ఉంది. ఆమెకు 10వ తరగతి చదువుతోంది. అతనిపై అయ్యప్పన్ కన్నుపడింది. మరదలిని బెదిరించాడు. లైంగిక దాడికి తెగబడ్డాడు. ఎవరికైనా చెప్పావో...అంటూ భయ భ్రాంతులకు గురి చేశఆడు. ఇలా బాలికను బ్లాక్ మెయిల్ చేస్తూ... ఒకటి కాదు ... రెండు కాదు ఆరేళ్లుగా బావ అత్యాచారం చేస్తూ వచ్చాడు.

దీంతో ఆమె గర్భవతి కావడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి అబార్షన్ చేయించేందుకు ప్రయత్నించాడు. అయ్యప్పన్ తీరుపై అనుమానం వచ్చిన డాక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయ్యప్పన్ పరారవ్వడంతో పోలీసులు అతడిని వెతికి పట్టుకున్నారు. విచారణలో అయ్యప్పన్‌ ఆరేళ్లుగా తనని బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు తెలిపింది. అయ్యప్పన్‌పై పోక్సో చట్టంలో కేసు నమోదు చేసి, అరెస్ట్‌ చేశారు.

First published: June 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...