Maharastra: రోజుకు 105 మంది మహిళలు.. మహారాష్ట్రలో మహిళలకు రక్షణ కరువు..

దేశ ఆర్థిక రాజధాని నగరం ముంబయి నెలకొని ఉన్న మహారాష్ట్ర.. దేశంలో పెద్ద రాష్ట్రాలలో ఒకటి. విస్తీర్ణం పరంగానే గాక.. నేరాలలోనూ ఆ రాష్ట్రం పలు నివేదికలో ముందు జాబితాలో ఉంది. ఇక ఎన్సీఆర్బీ తాజా నివేదిక అక్కడ మహిళల పరిస్థితిని అద్దం పడుతున్నది.

news18
Updated: October 20, 2020, 8:42 AM IST
Maharastra: రోజుకు 105 మంది మహిళలు.. మహారాష్ట్రలో మహిళలకు రక్షణ కరువు..
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: October 20, 2020, 8:42 AM IST
  • Share this:
విస్తీర్ణం పరంగా దేశంలో ఐదు పెద్ద రాష్ట్రాలలో ఒకటిగా ఉన్న మహారాష్ట్రలో.. మహిళలకు రక్షణ కరువైంది. రాష్ట్రంలో ప్రతిరోజు 105 మంది మహిళలు అపహరణకు గురవుతున్నారంటేనే అక్కడ పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అపహరణకు గురవడయే గాక వారానికి 17 మంది మానవ అక్రమరవాణాకు బాధితులవుతున్నారు. జాతీయపరంగా చూస్తే ఈ విషయంలో మహారాష్ట్ర జాబితాలో ముందుస్థానంలో ఉంది. మహిళల అక్రమరవాణా ిషయంలో ప్రథమ స్థానంలో మహారాష్ట్ర ఉండగా.. తర్వాతి స్థానంలో మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) తాజాగా విడుదల చేసిన ఈ నివేదికలో ఈ షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నివేదికలోని పూర్తి వివరాలు కింది విధంగా ఉన్నాయి.

2019 లో మహారాష్ట్రలో ప్రతి రోజు 105 మంది మహిళలు మిస్ అవుతున్నారు. పోలీసు స్టేషన్ లలో నమోదవుతున్న ఫిర్యాదుల ఆధారంగా ఈ లెక్కలు కట్టారు. అయితే జాతీయపరంగా కిడ్నాప్ లు తగ్గినప్పటికీ (0.7 శాతం) మహారాష్ట్రలో మాత్రం మహిళలపై నేరాలు పెరుగుతున్నాయి. మహిళలపై నేరాలు గతంతో పోల్చితే మహారాష్ట్రలో గతేడాది 1.9 శాతం పెరిగాయి. ఈ విషయంలో ఉత్తరప్రదేశ్ ప్రథమస్థానంలో ఉంది. ముంబయి, పూణె, నాగపూర్ వంటి ప్రధాన మెట్రో నగరాలలోనే గాక జిల్లాలలోనూ అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. అంతేగాక మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో సెక్స్ ట్రాఫికింగ్ కూడా ఎక్కువే. ముంబయి, పూణె, నాగపూర్ లలో రెడ్ లైట్ ఏరియాలు అందరికీ తెలిసిన రహస్యమే.

2018 తో పోల్చితే మహారాష్ట్రలో అపహరణకు గురైన మహిళల సంఖ్య 13 శాతం పెరిగింది. 2018 లో అత్యధికంగా తప్పిపోయిన పిల్లల జాబితాలో.. టాప్-10 లో కూడా మహారాష్ట్ర లేదు. కానీ 2019 లో అక్కడ 4,562 మంది తప్పిపోయారు. జాతీయపరంగా చూస్తే నాలుగో స్థానంలో ఉంది. తప్పిపోయిన పిల్లలో 55 శాతం మంది బాలికలు కావడం గమనార్హం.

ఇక మానవ అక్రమ రవాణా (లైంగికంగా వేధించేందుకు ఎత్తుకెళ్లడం, వ్యభిచారం, వెట్టి చాకిరి, బలవంతపు వివాహాలు చేయడం, డ్రగ్ పెడ్లింగ్ వంటివి ఈ జాబితాలోకి వస్తాయి) కేసులు 989 నమోదయ్యాయి. ఇందులో 88 శాతం మంది మహిళలు.. 6 శాతం పిల్లలు ఉన్నారు.

దేశవ్యాప్తంగా మహిళలపై నేరాలు పెరుగుతుండం ఆందోళన కలిగిస్తున్నది.  ఇటీవలే ఉత్తరప్రదేశ్ తో పాటు రాజస్థాన్ వంటి రాష్ట్రాలలో యువతులు, మహిళలపై  లైంగికదాడులు పెరుగుతున్న తరుణంలో తాజా నివేదిక మరింత ఆందోళన కలిగిస్తున్నది. నేరాలకు చిరునామాగా మారిన ఉత్తరప్రదేశ్ లో అయితే మహిళలపై లైంగికదాడులు నిత్యకృత్యమయ్యాయి. ఒక  గ్యాంగ్ రేప్ ఘటన మరువక ముందే మరోకటి వెలుగులోకి వస్తున్నది. ఈ నేపథ్యంలో మహిళల రక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Published by: Srinivas Munigala
First published: October 20, 2020, 8:42 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading