చంపుకుంటూ నదిలో పడేస్తున్నారు.. ఇప్పటికే 101 మందిని అతి దారుణంగా..

దేశ ఆర్థిక రంగం పూర్తిగా చితికిపోవడంతో ఏడాది క్రితం అప్పటి అధ్యక్షుడు బషీర్‌ అత్యవసర పొదుపు చర్యలు ప్రకటించారు. అనేక నిత్యావసరాల వాడుకపై నిషేధ ఆంక్షలు విధించారు. దీన్ని నిరసిస్తూ ప్రజలు ఉద్యమం చేపట్టారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 6, 2019, 8:58 AM IST
చంపుకుంటూ నదిలో పడేస్తున్నారు.. ఇప్పటికే 101 మందిని అతి దారుణంగా..
సూడాన్‌లో నిరసన జ్వాలలు (Twitter Pic)
  • Share this:
సూడాన్‌లో ప్రజాస్వామ్య అనుకూల నిరసనపై అక్కడి సైన్యం ఉక్కుపాదం మోపుతోంది. ఆర్మీ హెడ్‌ క్వార్టర్స్‌(టీఎంసీ) వెలుపల నిరసన తెలుపుతున్న వేలాది మంది ప్రజలపై సైన్యం అత్యంత కిరాతకంగా కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 101 మంది చనిపోయారు. వందల మంది గాయపడ్డారు. వీరంతా నెల రోజులుగా సూడాన్‌ రాజధాని ఖర్తూమ్‌లో ఆందోళన సాగిస్తున్నారు. దేశ ఆర్థిక రంగం పూర్తిగా చితికిపోవడంతో ఏడాది క్రితం అప్పటి అధ్యక్షుడు బషీర్‌ అత్యవసర పొదుపు చర్యలు ప్రకటించారు. అనేక నిత్యావసరాల వాడుకపై నిషేధ ఆంక్షలు విధించారు. దీన్ని నిరసిస్తూ ప్రజలు ఉద్యమం చేపట్టారు. ఇవి పతాక స్థాయికి చేరడంతో సైన్యం జోక్యం చేసుకొని 30 ఏళ్లుగా అధికారంలో ఉన్న బషీర్‌ను తొలగించి ప్రభుత్వాన్ని తన అధీనంలోకి తీసుకుంది. అయినా, ప్రజలు తమ నిరసనలు ఆపలేదు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ ఖర్తూమ్‌లోని ప్రధాన మైదానంలో ధర్నా చేపట్టారు. మంగళవారం నాడు 40 మందిని చంపి నైలూ నదిలో పడేయడంతో ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి.

‘‘మా అమరవీరుల్లో 40 మంది భౌతికకాయాలను నిన్న నైలు నది నుంచి వెలికి తీశాం’’ అని సెంట్రల్ కమిటీ ఆఫ్ సూడానీస్ డాక్టర్స్ బుధవారం ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొంది. సైన్యం దాడిలో 100 మంది చనిపోయారని.. ఆస్పత్రుల్లో మృతదేహాలను తాము తనిఖీ చేసి నిర్ధారించుకున్నామని వెల్లడించింది.
First published: June 6, 2019, 8:58 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading