హోమ్ /వార్తలు /క్రైమ్ /

Drunk Buffaloes: మద్యం తాగిన గేదెలు.. వింతగా ప్రవర్తన.. అసలు ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు.

Drunk Buffaloes: మద్యం తాగిన గేదెలు.. వింతగా ప్రవర్తన.. అసలు ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు.

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Drunk Buffaloes: సాధారణంగా ఒక మద్యం బాటిల్ ఎవరైనా తాగితేనే వింతగా ప్రవర్తిస్తూ హంగామా చేస్తారు. అలాంటిది ఒక్కటి కాదు.. రెండు కాదు ఏకంగా 101 బాటిళ్ల మద్యాన్ని మూడు గేదెలు తాగాయి. ఇక వాటి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...

గుజరాత్ లో పూర్తిగా మద్యపానం నిషేధం కొనసాగుతుంది. ఎవరైనా మద్యం తాగినట్లు గానీ, మద్యాన్ని విక్రయించినట్లు గానీ తెలిస్తే అక్కడ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారు. అయితే అహ్మదాబాద్ కు చెందిన ముగ్గురు రైతులు 101 మద్యం బాటిళ్లను ఎక్కడ నుంచి సంపాదించారో తెలియదు గానీ సారా వంటి మద్యాన్ని సంపాదించారు. ఇంట్లో ఆ బాటిళ్లను దాస్తే పోలీసులు వచ్చి పట్టుకుంటారనే భయంతో వాళ్లు తమ పొలం వద్ద ఉన్న నీటి కాలువ తూము వద్ద దాచిపెట్టుకున్నారు. కావాల్సిన సమయంలో వాటిని భయటకు తీసి తాగుదామని అనుకున్నారో లేదా విక్రయించాలని అనుకున్నారో తెలియదు గానీ.. అక్కడ దాచిన మద్యం బాటిళ్ల వళ్ల ఓ అనుకోని ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  గుజరాత్ రాష్ట్రంలో మద్యపానం పూర్తిగా నిషేధం. అయితే గాంధీనగర్ చిలోడా పోలీస్ స్టేషన్ పరిధిలోని దినేష్ ఠాకూర్, అంబరం ఠాకూర్ మరియు రవి ఠాకర్‌ అనే ముగ్గురు రైతులు రూ. 35 వేలు విలువ చేసే 101 మద్యం బాటిళ్లను ఎక్కడ నుంచో గానీ తీసుకొని వచ్చారు.

అవి ఇంట్లో దాస్తే ఎక్కడ దొరికిపోతామేమో అని పొలం దగ్గర దాచారు. అక్కడ నీటి కాలువ పక్కన ఉన్న తూములో ఆ బాటిళ్లను దాచారు. అక్కడ దాచిన బాటిళ్లపై మూతలు విరిగిపోయి ఆ తూములో ఉన్న నీటిలో కలిసిపోయాయి. ఆ నీటిని దినేష్ ఠాకూర్ కు చెందిన రెండు గేదెలు మరియు ఒక దూడ తాగా అనారోగ్యానికి గురయ్యాయి. ఆ నీటిని తాగిన గేదెలు కొద్దిసేపటి తర్వాత వింతగా ప్రవర్తించాయి. అంతే కాకుండా వాటి నోటి వెంట నురగ కూడా వచ్చింది. అది గమనించిన సదరు రైతులు ఆందోళన చెందాడు. వెంటనే పశు వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యుడు ఏం జరిగిందని రైతులను అడగ్గా జరిగిన విషయాలను చెప్పారు.

పొలాల వద్ద దాచిన మద్యం బాటిళ్లు ఆ నీటిలో కలిసి కులుషితం అయ్యాయని డాక్టర్ కు చెప్పాడు. ఆ నీటిని తాగడం వల్లనే గేదెలు ఇలా ప్రవర్తిస్తున్నాయని తెలిపాడు. చివరకు డాక్టర్ పోలీసులు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వచ్చి ఆ ముగ్గురు రైతులను అరెస్టు చేశారు. మందు తాగిన ఆ గేదెలకు సరైన చికిత్స అందించడంతో ఆ గేదెలు కోలుకుంటున్నాయి. చిలోడా పోలీస్ స్టేషన్ పీఎస్ఐ ఎన్ జి పర్మార్ ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించారు.

First published:

Tags: Ahmedabad, Gujarat

ఉత్తమ కథలు