Hathras Gang rape: హాథ్రస్ గ్యాంగ్ రేప్ కేసులో సంచలన ట్విస్ట్.. ఇద్దరి మధ్య ఫోన్ కాల్స్..

మృతురాలి సోదరుడి పేరిట ఉన్న నెంబర్ నుంచి సందీప్‌ ఠాకూర్‌కు క్రమం తప్పకుండా కాల్స్ వచ్చినట్లు, వెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. ఇరువురి మధ్య ఇప్పటి వరకు 100కు పైగా ఫోన్స్ కాల్స్ జరిగినట్లు కాల్ డిటెయిల్ రిపోర్టులో (CDR) తేలిందని తెలిపారు.

news18-telugu
Updated: October 7, 2020, 7:24 AM IST
Hathras Gang rape: హాథ్రస్ గ్యాంగ్ రేప్ కేసులో సంచలన ట్విస్ట్.. ఇద్దరి మధ్య ఫోన్ కాల్స్..
యూపీ హత్రాస్ బాధితురాలికి కొవ్వొత్తుల నివాళి (Image;AFP)
  • Share this:
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాథ్రస్ గ్యాంగ్ రేప్ కేసు సంచలన మలుపు తిరిగింది. పోలీసుల దర్యాప్తులో దిమ్మ తిరిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతురాలు, ప్రధాన నిందితుడు సందీప్ ఠాకూర్‌ ఏడాది నుంచి ఫోన్‌లో మాట్లాడుకుంటున్నట్లు తెలిసింది. మృతురాలి సోదరుడి పేరిట ఉన్న నెంబర్ నుంచి సందీప్‌ ఠాకూర్‌కు క్రమం తప్పకుండా కాల్స్ వచ్చినట్లు, వెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. ఇరువురి మధ్య ఇప్పటి వరకు 100కు పైగా ఫోన్స్ కాల్స్ జరిగినట్లు కాల్ డిటెయిల్ రిపోర్టులో (CDR) తేలిందని తెలిపారు. అక్టోబరు 2019 నుంచి మార్చి 2020 మధ్య ఈ కాల్స్‌ను గుర్తించామని చెప్పారు.

బాధితురాలి గ్రామమైన బూల్‌గారి నుంచి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో చందపా ప్రాంతంలో ఉన్న సెల్ టవర్‌ నుంచి ఎక్కువ కాల్స్‌ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఇరువురి ఫోన్ నంబర్ల మధ్య 62 అవుట్‌ గోయింగ్ కాల్స్, 42 ఇన్‌కమింగ్ కాల్స్.. మొత్తం 104 ఫోన్స కాల్స్ ఉన్నట్లు రికార్డులు చూపిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కేసులో బాధితురాలి గ్రామానికి చెందిన సందీప్ సింగ్ ప్రధాన అనుచరుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఐతే మృతురాలు, నిందితుడు కొన్ని నెలల పాటు ఫోన్‌లో టచ్‌లో ఉన్నారని పోలీసులు చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది.

యూపీలోని హత్రాస్‌ జిల్లాలో సెప్టెంబరు 14 20 ఏళ్ల దళిత మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగిన విషయం తెలిసిందే. పొలంలో తల్లి, సోదరులతో కలిసి పనిచేస్తున్న సమయంలో ఆమెను ఎత్తుకెళ్లి అత్యాచారం చేశారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి నాలుకను కోశారు. మెడను విరిచి గొంతు నులిమారు. అగ్ర కులాలకు చెందిన పలువురు వ్యక్తులే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితురాలు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆమెను మొదట అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి చెందిన జవహర్ లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీకి తరలించి.. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఢిల్లీలోని సఫ్దార్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సెప్టెంబరు 29న బాధితురాలు మరణించింది.

ఐతే బాధితురాలిపై అత్యాచారం జరగలేదని.. తీవ్రంగా కొట్టడం వల్లే చనిపోయిందని యూపీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ (లా అండ్ ఆర్డర్) చేసిన ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశమైంది. ‘యువతి మీద అత్యాచారం జరగలేదని ఫోరెన్సిక్ రిపోర్టులో వచ్చింది.’ అంటూ ఏడీజీ ప్రశాంత్ కుమార్ ప్రకటించారు. ‘పోస్టు మార్టం నివేదిక ప్రకారం బాధితురాలు మెడ మీద గాయం కారణంగా చనిపోయింది. ఆమె శరీరం మీద వీర్యం ఆనవాళ్లు లేవని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక తెలిపింది.’ అని చెప్పారు. ‘అలాగే, ఆ మహిళ పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో కూడా తన మీద అత్యాచారం జరిగినట్టు ఎక్కడా పేర్కొనలేదు. కేవలం కొట్టారని మాత్రమే చెప్పింది.’ అని కుమార్ తెలిపారు. ‘కులాల మధ్య చిచ్చు పెట్టడానికి, సమాజంలో చిచ్చు పెట్టడానికి కొందరు దీన్ని తప్పుగా ప్రచారం చేస్తున్నారు. అలాంటి వారిని గుర్తించి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.’ అని ఏడీజీ హెచ్చరించారు.

దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన ఈ కేసు అలహాబాద్ హైకోర్టు సుమోటోగా తీసుకొని.. రాష్ట్ర ఉన్నతాధికారులకు నోటీసులు పంపింది. అక్టోబరు 12న కోర్టుకు హాజరై హత్రాస్ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించాలని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, డీజీపీ, అడిషనల్ డీజీపీకి జస్టిస్ రంజన్ రాయ్, జస్టిస్ జస్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం సమన్లు జారీ చేసింది. జిల్లా మెజిస్ట్రేట్, జిల్లా ఎస్పీ కూడా కోర్టులో హాజరు కావాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల సమ్మతి లేకుండా అర్ధరాత్రి తర్వాత బాధితురాలి అంత్యక్రియలను రహస్యంగా నిర్వహించడంపై కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై కోర్టుకు తమ వాదనలను వినిపించాలని బాధితురాలి తల్లిదండ్రులకు కూడా అవకాశమిచ్చింది. వారు కోర్టుకు వచ్చేందుకు అవసరమైన ప్రయాణ ఏర్పాట్లను చేయాలని జిల్లా అధికారులను ఆదేశించింది.

గ్యాంగ్ రేపు విచారణలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీరు సరిగ్గా లేదనే ఆరోపణలు వినిపించడంతో.. యూపీ సర్కార్ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. హాథ్రస్ ఘటన విచారణను సీబీఐకు అప్పగించాలని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్ణయించారు. ఈ మేరకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ శనివారం బాధితురాలి కుటుంబాన్ని కలిసి పరామర్శించిన కొద్దిసేపటికే యూపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
Published by: Shiva Kumar Addula
First published: October 7, 2020, 7:12 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading