హోమ్ /వార్తలు /క్రైమ్ /

చేతులు మారిన రూ.100 కోట్లు..కీలకం కానున్న ఆ ల్యాప్ టాప్..ఢిల్లీ లిక్కర్ స్కాంలో సంచలనాలు వెలుగులోకి..

చేతులు మారిన రూ.100 కోట్లు..కీలకం కానున్న ఆ ల్యాప్ టాప్..ఢిల్లీ లిక్కర్ స్కాంలో సంచలనాలు వెలుగులోకి..

ఈడీ విచారణలో సంచలనాలు..

ఈడీ విచారణలో సంచలనాలు..

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి కస్టడీ గడువు నేటితో ముగియనుంది. ఈ క్రమంలో ఈడీ అధికారులు వారిద్దరిని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. దీనిపై ఇరుపక్షాల వాదనలు న్యాయస్థానం అభిషేక్ బోయినపల్లికి 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. అలాగే విజయ్ నాయర్ కస్టడీని మరో 4 రోజుల పాటు పొడిగించింది. ఈ లిక్కర్ స్కాంలో రూ.100 కోట్లు చేతులు మారాయని ఈడీ అధికారులు తెలిపారు. ఇక విజయ్ నాయర్ ల్యాప్ టాప్ ఈ వ్యవహారంలో కీలకం కానుంది. దీనితో ల్యాప్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. దానికి సంబంధించిన నివేదిక రేపు రానున్నట్లు తెలుస్తుంది. 

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Delhi

  ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor scam) లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో విజయ్ నాయర్ (Vijay Nayar), అభిషేక్ బోయినపల్లి (Boinapalli Abhishake)  కస్టడీ గడువు నేటితో ముగియనుంది. ఈ క్రమంలో ఈడీ (Enforcement Directorate) అధికారులు వారిద్దరిని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. దీనిపై ఇరుపక్షాల వాదనలు న్యాయస్థానం అభిషేక్ బోయినపల్లి (Boinapalli Abhishake) కి 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. అలాగే విజయ్ నాయర్  (Vijay Nayar) కస్టడీని మరో 4 రోజుల పాటు పొడిగించింది. ఈ లిక్కర్ స్కాంలో రూ.100 కోట్లు చేతులు మారాయని ఈడీ (Enforcement Directorate) అధికారులు తెలిపారు. ఇక విజయ్ నాయర్ ల్యాప్ టాప్ ఈ వ్యవహారంలో కీలకం కానుంది. దీనితో ల్యాప్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. దానికి సంబంధించిన నివేదిక రేపు రానున్నట్లు తెలుస్తుంది.

  తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. పెరగనున్న గ్రూప్-2, 3, 4 ఖాళీలు.. జీవో విడుదల చేసిన సర్కార్

  ఈడీ రిపోర్టులో సంచలన విషయాలు..

  కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. విజయ్ నాయర్ రిమాండ్ రిపోర్ట్ లో ఈడీ అధికారులు కీలక అంశాలను వెల్లడించారు. వివరాల ప్రకారం..ఢిల్లీలోని ప్రభుత్వ పెద్దలకు సుమారు రూ.100 కోట్లు అడ్వాన్స్ చెల్లింపులు చేసినట్లు తెలుస్తుంది. అలాగే పాలసీ తయారీలో విజయ్ నాయర్ కీలక పాత్ర పోషించినట్లు ఈడీ వెల్లడించింది.. అలాగే అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్ కలిసి లంచాలు ఇచ్చారు. హోల్ సెలర్ల నుండి డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తుంది. కాగా ఇప్పటివరకు రూ.30 కోట్ల వరకు ఢిల్లీ పెద్దలకు డబ్బులు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ పాలసీ తయారీలో విజయ్ నాయర్ కీలక పాత్ర పోషించారని రిపోర్ట్ లో తేలింది. పాలసీ తయారికి 2 నెలల ముందే విజయ్ నాయర్ చేతికి వచ్చినట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి వివరాలను వాట్సప్ ద్వారా పంపించారని తెలుస్తుంది. అలాగే విజయ్ నాయర్ ఢిల్లీ ఉన్నతాధికారిగా చెప్పుకున్నట్లు సమాచారం.

  169 చోట్ల సోదాలు..34 మంది పాత్ర 

  ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 169 చోట్ల ఈడీ సోదాలు చేపట్టింది. ఇందులో 34 మంది పాత్ర బయటపడిందని ఈడీ వెల్లడించింది. లిక్కర్ స్కామ్ బయటకు రాగానే ఈ 34 మంది నిందితులు 140 ఫోన్లు మార్చినట్లు ఈడీ తెలిపింది. మరి రేపు రాబోయే ల్యాప్ టాప్ ఫోరెన్సిక్ నివేదికలో ఏం తేలబోతుందనేది ఆసక్తిగా మారింది.

  Published by:Rajashekar Konda
  First published:

  Tags: Crime news, Delhi, Delhi liquor Scam, Hyderabad, Telangana

  ఉత్తమ కథలు