హోమ్ /వార్తలు /క్రైమ్ /

OMG : బాలికపై అత్యాచారం..కొద్దిసేపు తర్వాత డ్రైనేజీలో డెడ్ బాడీ!

OMG : బాలికపై అత్యాచారం..కొద్దిసేపు తర్వాత డ్రైనేజీలో డెడ్ బాడీ!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Girl Murdered : రాజస్తాన్(Rajastan)రాష్ట్రంలోని దుంగార్‌పూర్ జిల్లాలో పదేళ్ల బాలికడ్రైనేజీలో శవమై కనిపించింది. పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. అమాయక చిన్నారిపై మాజీ సర్పంచ్ మనవడు అత్యాచారం చేసి హత్య చేశాడని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు.

ఇంకా చదవండి ...

Girl Murdered : రాజస్తాన్(Rajastan)రాష్ట్రంలోని దుంగార్‌పూర్ జిల్లాలో పదేళ్ల బాలికడ్రైనేజీలో శవమై కనిపించింది. పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. అమాయక చిన్నారిపై మాజీ సర్పంచ్ మనవడు అత్యాచారం చేసి హత్య చేశాడని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు నిమగ్నమయ్యారు.

దుంగార్‌పూర్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాకేష్ శర్మ మాట్లాడుతూ... బుధవారం ఒక వ్యక్తి సదర్ పోలీస్ స్టేషన్‌లో తన కుమార్తె కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. తన 10 ఏళ్ల కూతురు తన సోదరుడితో కలిసి ఇంటి ప్రాంగణంలో పడుకుందని చెప్పాడు. ఉదయం ఆమె సోదరుడు, కుటుంబ సభ్యులు లేచి చూసే సరికి బాలిక ఇంట్లో కనిపించలేదని చెప్పాడు. చాలా సేపు వెతికినా తన కూతురు జాడ దొరకలేదని అతడు చెప్పాడని ఎస్పీ చెప్పారు.


Relationship Tips : ఫ్యామిలీతో కలిసి సంతోషంగా ఉండాలంటే ఇలా చేయండి


కాలువలో  మృతదేహం

సాయంత్రం కొంత సేపటికి బాలిక మృతదేహం గ్రామ సమీపంలోని కల్వర్టు కింద కాలువలో పడి ఉంది. బాలిక శరీరంపై ఎలాంటి గాయాలు లేవు. బాలిక ప్రైవేట్ పార్ట్ నుంచి రక్తం కారుతోంది. సమాచారం అందుకున్న గ్రామస్థులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని జిల్లా ఆసుపత్రి మార్చురీలో ఉంచారు. బాలిక మృతదేహం లభ్యమైన చోట మాజీ సర్పంచ్ మనవడు కనిపించాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అమాయక బాలికపై అత్యాచారం చేసి మాజీ సర్పంచ్ మనవడు చంపేశాడని బాధిత కుటుంబసభ్యులు ఆరోపించారు.

దుంగార్‌పూర్ జిల్లా ఆసుపత్రిలో బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు సదర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

First published:

Tags: Crime news, Rajastan

ఉత్తమ కథలు