ప్రభుత్వ స్కూల్‌లో పదేళ్ల బాలికపై స్వీపర్ అఘాయిత్యం... అక్కడ కూర్చొని తినమని చెప్పి...

ఢిల్లీలోని మున్సిపల్ స్కూల్‌లో వెలుగుచూసిన దారుణం... స్వీపర్ అరెస్ట్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: February 10, 2019, 7:02 PM IST
ప్రభుత్వ స్కూల్‌లో పదేళ్ల బాలికపై స్వీపర్ అఘాయిత్యం... అక్కడ కూర్చొని తినమని చెప్పి...
నమూనా చిత్రం
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: February 10, 2019, 7:02 PM IST
ఢిల్లీలో మరో దారుణ సంఘటన వెలుగుచూసింది. పదేళ్ల చిన్నారిపై స్వీపర్ అత్యాచారం చేసిన సంఘటన... దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ బస్తీకి చెందిన పదేళ్ల బాలిక... ఢిల్లీలోని షాదరా ఏరియాలో బంధువుల ఇంట్లో ఉంటూ అక్కడే ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటోంది. మున్సిపల్ స్కూల్‌లో ఐదో క్లాస్ చదువుతున్న ఈ చిన్నారిని... మధ్యాహ్న భోజన సమయంలో చెట్టు కింద తింటుండడం చూసిన స్వీపర్... ఓ ప్లేస్ చూపించి అక్కడికెళ్లి కూర్చొని తినమని చెప్పాడు. అతను చెప్పిన ప్రకారమే... స్వీపర్ చెప్పిన ప్రాంతంలో కూర్చొని భోజనం చేయడం మొదలెట్టిందా బాలిక.

కొద్దిసేపటి తర్వాత అక్కడికి వచ్చిన స్వీపర్... వెనక నుంచి నోరు మూసి బలవంతంగా ఓ ఖాళీ గదిలోకి తీసుకెళ్లి అత్యచారానికి ఒడిట్టాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దాంతో భయాందోళనలకు గురైన బాలిక... విషయాన్ని ఎవ్వరికీ చెప్పకుండా తనలోనే దాచుకుంది. అయితే రెండు రోజుల తర్వాత బాలిక పొత్తికడుపులో నొప్పి వస్తుందని చెప్పడంతో... బాలిక బంధువులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు... అత్యాచారం జరిగిన సంగతి చెప్పారు. ఏం జరిగిందని చిన్నారి నిలదీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలిక బంధువులు... తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... స్వీపర్‌ను అరెస్ట్ చేశారు. ఈ సంఘటనను సీరియస్‌గా తీసుకున్న పాఠశాల అధికారులు... స్వీపర్‌ను పనిలోంచి తీసేస్తున్నట్టు తెలిపారు. అయితే స్వీపర్ ఇంతకు ముందు మరెవ్వరైనా చిన్నారులపై ఇలా దాడి చేశాడా? అనే విషయమై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు పోలీసులు.


First published: February 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...