10 Of Family Killed in Jeep Rams Into Tractor Trolley In Rajasthan: రాజస్థాన్ లోని జుంజును జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్ ట్రాలీని జీపు వేగంగా వెళ్ళి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మృతి చెందారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకురని స్థానికులతో సహాయక చర్యలను ముమ్మరం చేశారు.
క్షతగాత్రులు సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాలు... ఝుంఝును- గూడా గాడ్జీ హైవే పై మంగళవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. బాధితులు ఆలయంలో ప్రార్థనలు చేసి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. ఆగి ఉన్న ట్రాక్టర్ ట్రాలీని జీపు ఢీకొనడంతో.. అందులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబంలోని 10 మంది మరణించారు. ఎనిమిది మంది గాయపడ్డారు అని ఝుంఝును సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) ప్రదీప్ మోహన్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ ఘటనపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అదే విధంగా, ఈ కష్ట సమయాన్ని అధిగమించే శక్తిని బాధిత కుటుంబాల వారికి ప్రసాదించాలని, మరణించినవారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లుగా తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
గతంలో అస్సాంలో రోడ్డు ప్రమాదం జరిగింది.
Five Members Of Bihu Team killed As Road Accident: అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బిస్వనాథ్ జిల్లాలో ఒక కార్య క్రమంలో పాల్గొని ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దాదాపు.. 20 మంది టీనేజర్లు ప్రత్యేక వాహానం మాట్లాడుకుని వెళ్లారు. తిరుగు ప్రయాణంలో.. డ్రైవర్ గోహాపూర్ సమీపంలోనికి రాగానే వాహానం అదుపు తప్పింది. దీంతో వాహానం పల్టీలు కొట్టుకుంటు బోర్లాపడింది. ఈ ఘటనతో అప్పటి వరకు పాటలు పాడుకున్న యువకులంతా.. ఒక్కసారిగా అరుపులు, కేకలు వేసుకుంటూ సహాయం కోసం ఆర్తనాదాలు చేశారు. ప్రమాదం జరిగినప్పుడు వాహానంలో దాదాపు.. 20 మంది ప్రయాణికలు ఉన్నారు.
వాహానం బోల్తాపడగానే డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. సంఘటన స్థలం అంతా రక్తసిక్తంగా మారిపోయింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు, స్థానికులతో కలసి సహయక చర్యలు చేపట్టారు. ఘటనస్థలంలోనే ఐదుగురు మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. కత గాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. మృతి చెందిన వారిని సంజయ్ బసుమతరీ (17), కొలిమన్ బసుమతరీ (21), బోర్నాలి బోరో (15), బుదిమోతి బోరో (14), రాధిక డైమరీ (15)గా గుర్తించారు.
వ్యాన్ ప్రమాదానికి కారణం.. అత్యధిక వేగమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఆస్పత్రులలో గాయపడిన వారికి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. ఘటనపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందించారు. ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సానుభూతి తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Rajasthan, Road accident