పాపం పసివాడు.. 3 ఏళ్ల బాలుడి శరీరంలో 10 సిరంజి సూదులు..

ఎక్స్‌రేలో కనిపిస్తున్న సూదులు

అతడి శరీరంలో 10 సూదులు కనిపించాయి. అనంతరం డాక్టర్లు సర్జరీ చేసి కొన్ని సూదులను తొలగించారు. అన్ని సూదులను ఒకేసారి తొలగిచడం సాధ్యం కాదని.. మిగిలిన సూదులను కొంతకాలం తర్వాత తీస్తామని చెప్పారు.

  • Share this:
    అభంశుభం తెలియని మూడేళ్ల చిన్నారి..! అమ్మా.. అని కూడా పిలవలేని పసి వయసు..! అలాడి పిల్లాడి శరీరంలో సిరంజి సూదులు గుచ్చిఉన్నాయి. ఒక్కటి కాదు రెండు..ఏకంగా 10 సిరంజిలు శరీరంలోని పలు భాగాల్లో కనిపించాయి. శరీర అంతర్భాగాల్లో సూదులు పెట్టే బాధతో ఆ పసివాడు తల్లడిల్లిపోతున్నాడు. వనపర్తిలోని వీపనగండ్లలో ఈ ఘటన వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. అశోక్, అన్నపూర్ణ దంపతులుకు మూడేళ్ల కుమారుడు లోక్‌నాథ్ ఉన్నాడు. ఐతే గత 15 రోజులుగా ఆ బాలుడు వెక్కి వెక్కి ఏడ్చుతున్నాడు. మాటలు రాకపోవడంతో కడుపులో ఏం బాధ ఉందో చెప్పలేని పరిస్థితి..! తల్లిదండ్రులు ఎంతో మంది డాక్టర్లకు చూపించినా ప్రయోజనం లేకపోయింది.

    ఐతే ఇటీవల బాలుడి మలద్వారం వద్ద పరిశీలించగా ఓ సూది కనిపించింది. దాంతో హుటాహుటిన వనపర్తిలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లి ఎక్స్‌రే తీశారు. అతడి శరీరంలో 10 సూదులు కనిపించాయి. అనంతరం డాక్టర్లు సర్జరీ చేసి కొన్ని సూదులను తొలగించారు. అన్ని సూదులను ఒకేసారి తొలగిచడం సాధ్యం కాదని.. మిగిలిన సూదులను కొంతకాలం తర్వాత తీస్తామని చెప్పారు. చిన్నారి పరిస్థితి చూసి కంటతడిపెట్టిన తల్లిదండ్రులు.. తమ బాలుడి శరీరంలోకి గుర్తుతెలియని వ్యక్తులు సూదులు గుచ్చారని ఆరోపించారు. తల్లిదండ్రులు ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: