పాకిస్తాన్ వాయవ్య ప్రాంతంలో బుధవారం చైనా ఇంజనీర్లు, పాక్ సైనికులతో వెళ్తున్న బస్సు పేలిపోగా 10 మంది మృతి చెందారు. మృతుల్లో ఆరుగురు చైనీయులు, ఇద్దరు పాక్ జవాన్లు సహా పదిమంది చనిపోయారు. బాంబు పేలుడులో మరో 39 మందికి గాయలయ్యాయి. దుండగులు ఈ బస్సును టార్గెట్ చేసి పేల్చి వేసి ఉండవచ్చునని భావిస్తున్నారు. గాయపడినవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరగవచ్చునని తెలుస్తోంది. దసు డ్యామ్ నిర్మాణ పనుల నిమిత్తం 30 మంది చైనీస్ ఇంజనీర్లతో పాటు అయిదుగురు సోల్జర్స్ ఈ బస్సులో బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న బస్సును టార్గెట్ చేసుకొని టెర్రిరిస్టులు ఐఈడీని పేల్చారు. అప్పర్ కొహెస్తాన్ ప్రాంతంలో వెళ్తున్న ఈ బస్సు పెద్దగా పేలిపోయింది. ఆ వెంటనే లోతైన లోయలో పడిపోయిందని హజారీ రీజన్ కు చెందిన ఓ అధికారి చెప్పారు. దాంతో బస్సులో ప్రయాణిస్తున్న 6గురు ఇంజనీర్లు, ఇద్దరు సోల్జర్స్, ఇద్దరు పారా మిలిటరీ ఉద్యోగులు ఘటనాస్థలంలోనే మరణించినట్లు సమాచారం.
అతేకాకుండా చైనాకు చెందిన ఓ ఇంజనీర్, ఓ సైనికుడు గల్లంతయ్యారన్నారు. పదుల సంఖ్యలో గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. గాయపడిన వారిని అధికారులు ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఇటీవలే లాహోర్ లో జరిగిన పేలుడు ఘటన మరిచిపోక ముందే ఈ బ్లాస్ట్ జరగడం ప్రభుత్వ వర్గాలను కలవరపరుస్తోంది.. కాగా-దాసు హైడ్రో-ఎలెక్ట్రిక్ ప్రాజెక్టు..చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ లో భాగమని, 65 బిలియన్ డాలర్ల పెట్టుబడితో పశ్చిమ ప్రాంత చైనాను, సదర్న్ పాకిస్తాన్ లోని గ్వాడార్ సీ పోర్టునుకలిపే బృహత్తర ప్రాజెక్టు ఇదని తెలిసింది. ఈ ప్రాజెక్టు పనుల్లో కొన్నేళ్లుగా చైనా ఇంజనీర్లు, పాక్ నిర్మాణ రంగ కార్మికులు, ఇతరులు ఇక్కడ పని చేస్తున్నారు. రోడ్డు పక్కన ఉంచిన పేలుడు డివైజ్ కారణంగా ఈ ఘటన జరిగిందా లేక.. బస్సులోని డివైజ్ ఏదైనా పేలిపోయిందా అన్న విషయం ఇంకా తెలియడంలేదు.
దీనిపై చైనా, పాకిస్తాన్ దేశాలు దాదాపు విమర్శించుకుంటున్నాయి. ఇది బాంబు దాడి అని చైనా అంటుండగా..కాదని గ్యాస్ లీక్ వల్ల ప్రమాదం జరిగిందని పాకిస్థాన్ చెబుతోంది. ఈ ఘటనలో 12 మంది మరణించారని, వీరిలో 9 మంది చైనీయులని డ్రాగన్ కంట్రీ ప్రకటించింది. ఈ ఎటాక్ కి పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. పాక్ లోని చైనీస్ ఎంబసీ బస్సు పేలుడు ఘటనను ఖండిస్తూ..ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పాక్ ప్రభుత్వాన్ని గట్టిగా కోరింది. అటు దీనిపై చైనా విదేశాంగ వ్యవహారాల అధికార ప్రతినిధి జావో లిజియన్ తీవ్ర దిగ్భ్రాంతిని ప్రకటిస్తూ ఇది ముమ్మాటికీ బాంబు దాడేనని అన్నారు. ఇందుకు పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bomb attack, Bomb blast, China, Crime news, Pakistan