విషాదం.. పంజాబ్‌లో ప్రసాదం తిని పది మందికి అస్వస్థత..

ఇంటిలో ప్రార్థనలు ముగిసిన తర్వాత రఘువీర్ సింగ్ కుటుంబ సభ్యులు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. అనంతరం మిగిలిపోయిన ప్రసాదాన్ని తమీపంలో తార్న్ తరణ్ గురుద్వారాకు తీసుకెళ్లారు.

news18-telugu
Updated: July 5, 2020, 9:25 AM IST
విషాదం.. పంజాబ్‌లో ప్రసాదం తిని పది మందికి అస్వస్థత..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పంజాబ్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ గురుద్వారాలోని ప్రసాదం తిని పది మందికి అస్వస్థతకు గురయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. పంజాబ్‌‌కు చెందిన రఘువీర్ సింగ్ తన తల్లి ఇటీవల చనిపోయింది. దీంతో శనివారం రఘువీర్ సింగ్ తన ఇంటిలో సుఖ్మాణి సాహిబ్ కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో భాగంగా పంపిణీ చేసిందుకు ప్రసాదం తయారు చేశారు. ఇంటిలో ప్రార్థనలు ముగిసిన తర్వాత రఘువీర్ సింగ్ కుటుంబ సభ్యులు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. అనంతరం మిగిలిపోయిన ప్రసాదాన్ని తమీపంలో తార్న్ తరణ్ గురుద్వారాకు తీసుకెళ్లారు. అక్కడి భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ప్రసాదం తిన్న వెంటనే 10 మంది భక్తులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే వారిని సమీపంలోని అమృత్‌సర్‌లోని ఆస్పత్రికి తరలించారు.

ఆ ఆస్పత్రిలో ప్రస్తుతం వారందరూ చికిత్స పొందుతుండగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే ప్రార్థనలు నిర్వహించిన ఇంటిలో పంపిణీ చేసిన ప్రసాదం తిన్నవారికి ఏలాంటి అస్వస్థత లేదు. దీంతో గురుద్వారాకు తీసుకెళ్లిన మిగిలిపోయిన ప్రసాదంలో విషం కలిసి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Published by: Narsimha Badhini
First published: July 5, 2020, 9:25 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading