Home /News /crime /

10 DEAD AND 251 INJURED IN TOXIC GAS LEAK IN JORDAN AQABA PORT PVN

Toxic gas leak : విషవాయువులు లీక్..10మంది మృతి,251మంది హాస్పిటల్ లో!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Toxic gas leak : గ్యాస్ ట్యాంక్(Gas TANK) నుంచి విషవాయువులు(Poisonous Gas) లీక్ అవడంతో 10 మంది ప్రాణాలు కోల్పోగా,. 251 మంది అస్వస్థతకు గురయ్యారు.

Toxic gas leak : గ్యాస్ ట్యాంక్(Gas TANK) నుంచి విషవాయువులు(Poisonous Gas) లీక్ అవడంతో 10 మంది ప్రాణాలు కోల్పోగా,. 251 మంది అస్వస్థతకు గురయ్యారు. జోర్డాన్(Jordan)​ దేశంలోని అకాబా నగరంలో ఈ దుర్ఘటన జరిగింది గ్యాస్​ ట్యాంకును రవాణా చేస్తుండగా ప్రమాదవశాత్తు లీక్ అయిందని జోర్డాన్ పబ్లిక్ సెక్యూరిటీ డైరెక్టరేట్ తెలిపింది. అయితే ఆ ట్యాంకర్‌లో ఉన్న పదార్థాలు ఏంటన్నది అధికారులు వెల్లడించలేదు.

గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించిన తర్వాత అధికారులు ఆ ప్రాంతాన్ని మూసివేశారని.. విషవాయువులు లీక్‌ అవకుండా అడ్డుకునేందుకు నిపుణులను అక్కడికి పంపారని మాత్రమే జోర్డాన్ పబ్లిక్ సెక్యూరిటీ డైరెక్టరేట్ తెలిపింది. గ్యాస్ లీక్ అయిన ప్రదేశంలో నివసించే ప్రజలు తమ ఇంటి కిటికీలు, తలుపులు మూసేసి ఇళ్లల్లోనే ఉండాలని స్థానిక ఆరోగ్య అధికారి డాక్టర్ జమాల్ ఒబీదత్ ప్రజలను కోరారు. ఘటనాస్థలికి సమీప నివాస ప్రాంతం 25 కిలోమీటర్లు  దూరంలో ఉంది.

Agneepath : అగ్నిపథ్ కు విశేష స్పందన..ఒక్క ఎయిర్ ఫోర్స్ కే 4 రోజుల్లో 94వేల దరఖాస్తులు

మరోవైపు,శ్రీలంకలో (Sri lanka) ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారింది. కాగా, ఇంధన నిల్వలు పూర్తిగా అయిపోయాయని ఆ దేశం ప్రకటించింది.ఈ రోజు అర్ధరాత్రి నుండి అత్యవసరమైన సర్వీసులు మాత్రమే పనిచేస్తాయని తెలిపింది. అవసరమైన సేవల జాబితాలో ఆరోగ్యం, శాంతిభద్రతలు, ఓడరేవులు, విమానాశ్రయం, ఆహార పంపిణీ, వ్యవసాయం ఉంటాయి. జూలై 10 వరకు ఇతరాత్ర అవసరాలకు ఇంధన సరఫరా సేవలుపూర్తిగా నిలిపివేయబడ్డాయని ఆ దేశం స్పష్టం చేసింది. ఇక పెట్రోల్ , డీజీల్ లేకపోతే.. పాఠశాలలు మూసివేయబడతాయి. ప్రైవేట్ కార్యాలయాలు పనిచేయలేవు. ఉద్యోగులు ఇంటి నుండి పని చేయాలని సూచించారు. ప్రభుత్వ అధికారులు ఇంటి నుండి పనిని చేసుకోవాలని కోరారు. 22 మిలియన్ల జనాభా ఉన్న ద్వీప దేశం ఇంధనం అయిపోవడం ఇదే మొదటిసారి.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Gas leak

తదుపరి వార్తలు