10 Babis: ఒకే కాన్పులో 10 మంది పిల్లలకు జన్మ.. అదంతా కట్టుకథేనా..? దాని కోసం అంత పని చేశారా..?

ఒకే కాన్పులో 10 మంది పిల్లలకు జన్మ..అంతా అబద్ధం(image credit - twitter)

ఒకే కాన్పులో పది మందికి జన్మ ఇచ్చిన మహిళ వార్త నిజం కాదా..? మరి పది మంది పుట్టినట్టు ఆ దంపతులు ఎందుకు అబద్ధం చెప్పారు..? వాళ్లను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు..?

 • Share this:
  దక్షిణాఫ్రికాకు చెందిన ఓ మహిళ ఏకంగా 10 మంది పిల్లలకు జన్మనిచ్చిందనే వార్త ప్రపంచాన్ని తీవ్ర ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రపంచంలో ఒకే కాన్పులో అత్యంత ఎక్కువ మంది పిల్లలు పుట్టడం ఇదే తొలిసారని రికార్డులు తిరగేసి చెక్ చేసుకున్నారు అంతా.. ఇదే ప్రపంచ రికార్డు అని అంతా ఒప్పుకున్నారు కూడా. గత నెలలో మొరాకోలో హాలిమా సిస్సే అనే మహిళ... 9 మంది పిల్లలకు జన్మనిచ్చింది. ఇప్పుడు 37 ఏళ్ల గోసియామే థమారా సిథోలే... 10 మంది పిల్లలకు జన్మనిచ్చింది. వారిలో ఏడుగురు మగ పిల్లలు కాగా... ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. ఆమె భర్త తెబోగో సోతెత్సీ ప్రకారం... ప్రిటోరియాలోని ఆస్పత్రిలో... సిజేరియన్ సెక్షన్‌లో జులై 7న ఆమె ఈ పిల్లలకు జన్మనిచ్చింది.

  డాక్టర్లు మొదట ఆమెను స్కాన్ చేసినప్పుడు... ఆరుగురు పిల్లలకు జన్మనిస్తుందని అన్నారు. ఆ తర్వాత మరో సందర్భంలో చెక్ చేసినప్పుడు... ఎనిమిది మంది పిల్లలకు జన్మనివ్వబోతోందని చెప్పారు. కానీ ఇప్పుడు పిల్లలు పుట్టినప్పుడు మాత్రమే... మొత్తం 10 మంది ఉన్నట్లు తేలింది. ఇటీవల వైరల్ అయిన వార్త ఇది..

  ఇదీ చదవండి: డ్రాగెన్ కు వార్నింగ్.. భారత్- అమెరికా కలిస్తే ఇదీ సత్తా.. అదుర్స్ అనిపిస్తున్న యుద్ధ విన్యాసాలు

  ఒకే కాన్పులో పది మంది సంతానికి జన్మనిచ్చిందని తెలియడంతో ఆ మహిళకు సంబంధించిన వార్త తెగ వైరల్ అయ్యింది. కానీ అసలు నిజం ఏంటో బయటపడింది. పది మంది సంతానం ఉన్నట్లు ఆధారాలు లేకపోవడంతో అప్పట్లోనే ఈమెపై పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. పది మంది పిల్లలు ఒకే కాన్పులో పుట్టారని ఆధారాలు చూపాలని పలువురు కోరారు. దీనిపై కొంతమంది పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి గోసియామే కనిపించడం లేదు.

  ఇదీ చదవండి: వ్యాక్సిన్ వేసుకున్నారా? ఇక్కడ మీకు ఆఫర్లున్నాయ్.. ఫ్లైట్ నుంచి ఫుడ్ వరకు.. డిస్కౌంట్ ఎంతంటే?

  తాజాగా గొసైమ్ కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో జూన్ 17వ తేదీన జోహన్స్ బర్గ్ లోని ఆమె బంధువుల నివాసం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలు ఏమైందనే అనుమానంతో పూర్తి స్థాయి విచారణ చేపట్టారు. దీంతో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె చెప్పిన సమాధానం విని పోలీసులు సైతం షాక్ కు గురయ్యారు. పలు ఫిర్యాదుల నేపథ్యంలో పది మంది సంతానం విషయంలో నిగ్గు తేల్చేందుకు సామాజిక కార్యకర్తల సహాయంతో తెంబ్సియా ఆస్పత్రి సైకియాట్రిక్ విభాగంలో ఆమెను చేర్చారు. దీంతో ఆమె నిజయం ఒప్పుకోక తప్పలేదని తెలుస్తోంది. సంతానానికి జ‌న్మ‌నిచ్చ‌న క‌థ‌ను ప్ర‌చారంలో పెట్టి న‌వ‌జాత శిశువుల‌కు ప్ర‌జ‌ల నుంచి విరాళాలు సేక‌రిస్తూ మిలియ‌నీర్ కావాల‌ని త‌న భ‌ర్త ప్లాన్ చేసిన‌ట్టు ఆమె తన నేరాన్ని ఒప్పుకున్నారు. కేవలం డబ్బులు సంపాదించాలని.. అలాగే త్వరగా ఫేమస్ కావాలనే దుర్భుద్ధితోనే ఈ ప్లాన్ రచించినట్టు పోలీసులు గుర్తించారు.

  ఇదీ చదవండి: భారత్ తో ఆ దేశం చేపల బేరం?.. వ్యాక్సిన్ ఇస్తేనే పులస చేపలిస్తాం?

  పది మంది శిశువులు పుట్టినట్లు ఆధారాలు లేవని దక్షిణాఫ్రికా ఆరోగ్య శాఖ కూడా స్పష్టం చేసింది. మరోవైపు…ఆమె విడుదలను కోరుతూ..కోర్టు ఉత్తర్వుల కోసం ప్రయత్నిస్తానని మహిళా తరపు న్యాయవాది రెఫెలో వెల్లడించారు.
  Published by:Nagesh Paina
  First published: