Home /News /crime /

చిన్నారిని రక్కేసిన వీధి కుక్కలు...హైదరాబాద్‌లో దారుణం

చిన్నారిని రక్కేసిన వీధి కుక్కలు...హైదరాబాద్‌లో దారుణం

కుక్కల దాడిలో బాలుడికి గాయాలు

కుక్కల దాడిలో బాలుడికి గాయాలు

అఖిల్ తలతో పాలు ఇతర శరీర భాగాల్లో గాయాలయ్యాయి. చిన్నారి ఏడుపు విన్న స్థానికులు ఘటనాస్థలానికి వెళ్లి కుక్కలను తరిమేశారు.

    హైదరాబాద్‌లో వీధి కుక్కలు రెచ్చిపోయారు. ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న చిన్నారిపై దాడి చేశాయి. కుక్కల దాడిలో ఆరేళ్ల బాలుడికి గాయాలయ్యాయి. మౌలాలీలో ఈ ఘటన జరిగింది. బాలుడిని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆరేళ్ల అఖిల్ ఇంటి సమీపంలో ఆడుకుంటున్న సమయంలో సుమారు 10 కుక్కలు వచ్చి దాడిచేశాయి. బాలుడి శరీరాన్ని గోళ్లతో రక్కేశాయి. అఖిల్ తలతో పాలు ఇతర శరీర భాగాల్లో గాయాలయ్యాయి. చిన్నారి ఏడుపు విన్న స్థానికులు.. ఘటనాస్థలానికి వెళ్లి కుక్కలను తరిమేశారు. అనంతరం బాలుడిని ఆస్పత్రికి తరలించారు.

    ఈ ఘటనతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. మౌలాలీ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు తెలిపారు. జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. అధికారులు ఇప్పటికైనా మేల్కొని వీధి కుక్కలను పట్టుకోవాలని కోరుతున్నారు. ఘటనపై స్పందించిన అధికారులు వీధికుక్కలను పట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు. చిన్నపిల్లలను ఒంటరిగా వదిలేయకూడదని తల్లిదండ్రులకు సూచించారు.
    First published:

    Tags: Crime, Hyderabad, Stray dogs attack

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు