దేశ రాజధాని ఢిల్లీని (Delhi) వరుస అగ్ని ప్రమాదాలు బెంబెలెత్తిస్తున్నాయి. తాజాగా, బవానా ఇండస్ట్రియల్ ఏరియాలో (Bawana Industrial Area) భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కాగా, భవనం మొదటి అంతస్థులో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే ఆ ప్రాంతమంతా దట్టమైన పోగలు అలుముకున్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ఏడుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. 17 ఫైర్ యంత్రాలు మంటలను ఆర్పడానికి ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
Delhi | Fire breaks out in a manufacturing unit in Bawana Industrial Area, 17 fire tenders rushed to the site pic.twitter.com/a5XTlvWiFj
పోలీసులు, ప్రమాదం (Fire accident) జరిగిన ప్రాంతంలో పెద్ద ఎత్తున అంబులెన్స్ లను ఏర్పాడు చేశారు. గాయపడ్డవారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. గాయపడిని వారిని మెరుగైన చికిత్స అందించాలని అధికారులు వైద్యులను కోరారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న కార్మికులలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా, ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసు అధికారులు షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందా.. మరేదైన ప్రమాదం జరిగిందా.. అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేపట్టారు.
ఇదే విధంగా గతంలోను ఢిల్లీలో అగ్ని ప్రమాదం సంభవించింది.
దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర అగ్నిప్రమాద (Delhi Fire Mishap) ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పటి వరకు 27 మంది మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు చెప్పారు. వీరంతా సజీవ దహనమైనట్లు పేర్కొన్నారు. మరో 40 మంది గాయపడ్డారని, వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో.. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని డాక్టర్లు చెబుతున్నారు. అర్ధరాత్రి తర్వాత మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి.
కానీ రెస్క్యూ సిబ్బంది పలు కార్యాలయాల్లోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. తీవ్రమైన వేడి ఉండడంతో వారు లోపలికి వెళ్లేకపోయారు. ఇవాళ వేడి తగ్గిన తర్వాత మరోసారి లోపలికి వెళ్లనున్నారు. గదులన్నీ పరిశీలించి.. ఇంకా ఎవరైనా ఉన్నారా? అని చూడనున్నారు. ఆ భవనంలో ఇంకా కొందరు చిక్కుకొని ఉన్నారని స్థానికులు చెప్పారు. మరి వారంతా ఏమయ్యారన్నది తెలియాల్సి ఉంది.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.