Home /News /crime /

1 DEAD AFTER FOUR STOREYED BUILDING COLLAPSES IN MUMBAI KURLA RESCUE OPS UNDERWAY PVN

Building Collapse:కుప్పకూలిన నాలుగంతస్తుల బిల్డింగ్..ఒకరుమృతి..శిథిలాల కిందే 25మంది!

కొనసాగుతున్న సహాయక చర్యలు

కొనసాగుతున్న సహాయక చర్యలు

Building Collapses:మహారాష్ట్ర ముంబై నాయక్‌నగర్‌లో సోమవారం అర్ధరాత్రి నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. సమాచారం అందుకున్న అధికారులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

సోమవారం అర్థరాత్రి ముంబై(Mumbai)లోని కుర్లా ప్రాంతంలో నాలుగు అంతస్థుల భవనం కుప్పకూలింది(Building Collapse). ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న అధికారులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. సోమవారం రాత్రి నుండి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, ఇప్పటివరకు శిథిలాల కింద నుంచి ఎనిమిది మంది సజీవంగా బయటకు తీశారు. ఆ తర్వాత వారిని హాస్పిటల్ కి తరలించగా..అక్కడ వారు చికిత్స పొందుతున్నారు. సంఘటనా స్థలాన్ని మంత్రి ఆదిత్య ఠాక్రే సందర్శించారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది.

శిథిలాల కింద ఇంకా ఎంతమంది చిక్కుకున్నారనేదానిపై నిర్ధారణ లేదని, అయితే BMC యొక్క డేటా ప్రకారం, శిధిలాల కింద ఇంకా 20-25 మంది ఉండవచ్చని NDRF డిప్యూటీ కమాండెంట్ ఆశిష్ కుమార్ తెలిపారు. ఘటన జరిగిన కాలనీలో నాలుగు శిథిలావస్థకు చేరిన భవనాలు ఉన్నాయని, స్థానిక కార్పొరేటర్ ప్రవీణ మొరాజ్‌కర్ తెలిపారు. ఆరేళ్ల క్రితమే తమ నివాసాలను ఖాళీ చేయాలని ఆ బిల్డింగ్ లో ఉన్నవాళ్లకు నోటీసులు ఇని ఇవ్వబడ్డాయని. అయినప్పటికీ, అందులో నివాసం కొనసాగిస్తూనే ఉన్నారని ఆమె చెప్పారు. ప్రస్తుతం ఒక బిల్డింగ్ కుప్పకూలిన నేపథ్యంలో..మిగిలిన మూడు భవనాల అద్దెదారులను మంగళవారం ఉదయం BMC బదిలీ చేయనున్నట్లు మొరాజ్కర్ తెలిపారు. బిల్డింగ్ ల కూల్చివేతను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. కాగా,ఇటీవల బాంద్రా వెస్ట్‌లోని శాస్త్రినగర్‌లో భవనం కూలిన ఘటనలో ఓ వ్యక్తి మరణించగా 19 మంది గాయపడ్డ విషయం తెలిసిందే.

Diabetes : షుగర్ కంట్రోల్ లో ఉండాలంటే ఏం తినాలి..ఏం తినకూడదు!

Treatment On Roads : నీట మునిగిన హాస్పిటల్స్..రోడ్లపైనే పేషెంట్లకు ట్రీట్మెంట్

అమెరికాలో (America) మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ప్రజలు అక్కడ గన్ కల్చర్ లో ప్రజలు భయాందోళనలకు గురౌతున్నారు. ప్రతిరోజు కాల్పుల ఘటనలు వెలుగులోనికి వస్తున్నాయి. దుండగులు పాఠశాలలు, సూపర్ మార్కెట్ లు, బహింరంగ ప్రదేశాల్లో కాల్పులకు తెగబడుతున్నారు. కొన్ని చోట్ల ప్రవాస భారతీయులనే టార్గెట్ గా చేసుకుని కాల్పులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో మరో దారుణమైన ఘటన వెలుగులోనికి వచ్చింది. టెక్సాస్ రాష్ట్రంలోని శాన్ ఆంటోనియోలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న రైలు పట్టాల పక్కన ఒక ట్రక్ ను (Texas Truck) గుర్తించారు. అక్కడికి వెళ్లి చూసే సరికి.. దానిలో అనేక శవాలు (Dead bodies in truck) ఉన్నాయి. దీంతో అక్కడి వారు షాకింగ్ కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మెక్సికన్ నుంచి 160 మైళ్ల దూరంలో ఉన్న ప్రాంతంలో ఈ ఘటన వెలుగులోనికి వచ్చింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ ట్రక్ అక్కిడికి ఎలా వచ్చిందో విచారణ చేపట్టారు. అంత మంది విగత జీవులుగా మారడానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Building Collapse, Mumbai

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు