జమ్ములోని బారాముల్లా (Jammu kashmir) ప్రాంతం ఉగ్రదాడులతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఉగ్రవాదులు.. దుకాణంపైకి గ్రానెడ్ తో దాడిచేశారు. ఈ ఘటనలో ఒకరు అక్కడిక్కడే చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు అప్రమత్తమయ్యారు. కాల్పులు జరిపిన తర్వాత ఉగ్రవాదులు అక్కడి నుంచి పారిపోయారు. స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
Terrorists lobbed hand grenade inside a newly opened wine shop in Baramulla. O4 employees got injured. One among them succumbed to his injuries. All are from Jammu division. Area cordoned and search started to nab culprits.@JmuKmrPolice@BaramullaPolice
— Kashmir Zone Police (@KashmirPolice) May 17, 2022
క్షత గాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ రోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో దాడిచేసినట్లు తెలుస్తోంది. కొత్తగా తెరచిన వైన్ షాపులో ఉగ్రవాదులు దాడిచేశారు. వెంటనే భద్రత బలగాలు ఉగ్రవాదుల కోసం కుంబింగ్ చేపట్టాయి. ఆ ప్రాంతంలో మరెక్కడైన పేలుడు పదార్థాలు ఉన్నయా అన్న కోణంలో సెర్చింగ్ చేపట్టారు. దీంతో అక్కడ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
Civilian Died In Cross Firing
జమ్మూకశ్మీర్ లో మరో ఎన్ కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో ఆదివారం షోపియాన్ జిల్లాలోని తుర్క్వాగమ్ ప్రాంతంలో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో తర్క్వాగమ్ పుల్వామాతో కలిపే వంతెన వంతెన సమీపంలో సీఆర్పీఎఫ్ బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలోనే ఓ పౌరుడు గాయపడ్డారు. వెంటనే అతడిని బలగాలు పుల్వామా జిల్లా హాస్పిటల్ కి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడని ఆదివారం స్థానిక పోలీస్ అధికారులు తెలిపారు.
మృతుడిని తుర్క్వాగమ్కు చెందిన షోయబ్ అహ్మద్ ఘనీ(22)గా గుర్తించారు. కాల్పుల తర్వాత ఉగ్రవాదులు సమీపంలో ఉన్న తోటల్లోకి పారిపోయారని..ప్రస్తుతం భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కేసు నమోదు చేశామని,దర్యాప్తు కొనసాగుతున్నట్లు చెప్పారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.