Pay Equity Policy: క్రికెట్లో లింగ వివక్షతకు ఏమాత్రం తావు లేకుండా ఆయా క్రికెట్ బోర్డులు ఇప్పుడిప్పుడే ప్రశంసనీయ నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఐసీసీ గతంలో ఓ నిర్ణయం తీసుకోగా తాజాగా ఇండియన్ క్రికెట్ ఆర్గనైజేషన్‌లో లింగ సమానత్వం తీసుకొచ్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. అక్టోబర్ 27న పే ఈక్విటీ పాలసీ (Pay Equity Policy) పద్ధతిని తీసుకొచ్చింది. అంటే ఇప్పటినుంచి టీమిండియా మహిళా క్రికెటర్లు పురుష క్రికెటర్లతో సమానంగా మ్యాచ్ ఫీజు పొందనున్నారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రముఖులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, అనుష్క శర్మ, తాప్సీ పన్ను, ప్రియాంక చోప్రా తదితరులు వివక్షకు స్వస్తి పలికి.. పురుష, మహిళా క్రికెటర్లకు సమాన వేతనం అందించాలనే బీసీసీఐ చారిత్రాత్మక నిర్ణయాన్ని ప్రశంసించారు.
సొట్ట బుగ్గల సుందరి తాప్సీ ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బీసీసీఐకి కృతజ్ఞతలు తెలిపింది. ‘ఇది సమాన పనికి సమాన వేతనం దిశగా భారీ అడుగు.’ అని తాప్సీ ఒక ట్వీట్ చేసింది. బాలీవుడ్ బ్యూటీ, విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో బీసీసీఐ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఓ వార్త స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసింది. ఈ నిర్ణయాన్ని మెచ్చుకుంటున్నట్లు మూడు చప్పట్లు కొట్టే ఎమోజీలను ఆ స్టోరీస్ పోస్ట్‌కు జత చేసింది.
‘ఎంత మంచి ఫ్రంట్ ఫుట్ షాట్. క్రీడలు ఇలాంటి సమానత్వాన్ని పాటించడమనేది ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో ఇతరులు దీనిని ఫాలో కావడానికి మార్గం సుగమం చేస్తుందని ఆశిస్తున్నా.’ అని షారూఖ్ ఖాన్ ఒక ట్వీట్ చేశాడు. ‘వావ్! లేవగానే ఎంత మంచి న్యూస్ వింటున్నాం. సరైన దిశలో బీసీసీఐ వేసిన అద్భుతమైన అడుగు ఇది. థాంక్యూ’ అని ప్రీతి జింటా శుక్రవారం ఉదయం ట్వీట్ చేసింది.
Exclusive: యుద్ధంలో నెమ్మదించిన ఉక్రెయిన్ ..బలంగా మారిన రష్యా .. క్రెమ్లిన్ సోర్సెస్ నుంచి న్యూస్18 ఎక్స్‌క్లూజివ్
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక వీడియోను షేర్ చేస్తూ.. ‘బీసీసీఐ.. మీరు చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. సమానత్వం, వేతన సమానత్వాన్ని నిర్ధారించడంలో చిరస్మరణీయమైన నిర్ణయమిది. ఇది మాకు చాలా మొదటిది అవుతుందని నేను ఆశిస్తున్నాను.’ అని పేర్కొంది. అంటే ఈ ముద్దుగుమ్మ బీసీసీఐ నిర్ణయంతో భవిష్యత్తులో ప్రతి చోటా కూడా మహిళలకు ఈక్వల్ పే అందాలని ఆశిస్తున్నట్లు పేర్కొంది.
స్టార్ యాక్టర్ అక్షయ్ కుమార్ కూడా బీసీసీఐ నిర్ణయాన్ని స్వాగతించారు. ‘ఇది కచ్చితంగా అద్భుతమైన నిర్ణయం, మన మహిళా ప్లేయర్లు ప్రొఫెషనల్ క్రికెట్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తుంది.’ అని అక్షయ్ కుమార్ ప్రశంసించారు.
ప్లేయర్లకు మ్యాచ్ ఫీజులు ఎంత
ప్రస్తుతం టీమిండియా మేల్ క్రికెటర్స్ ప్రతి టెస్టు మ్యాచ్‌కు రూ.15 లక్షలు, వన్డేకు రూ.6 లక్షలు, టీ-20కు రూ.3 లక్షలు తీసుకుంటున్నారు. మొన్నటిదాకా మహిళా క్రికెటర్లు వన్డే, టీ20లకు రూ.1 లక్ష తీసుకోగా... టెస్టు మ్యాచ్‌కు రూ. 2 లక్షల 50 వేలు పుచ్చుకున్నారు. ఇక నుంచి మాత్రం టీమిండియా మేల్ క్రికెటర్లకు సమానంగా ఫీజు అందుకోనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bcci