Home /News /cricket /

IPL CRICKET WANKHEDE GROUNDSMEN ACCOMMODATION IN A FIVE STAR HOTEL FOR GROUND STAFF WHO SPEND THE NIGHT AMONG MOSQUITOES CADBURY COMPANY ARRANGEMENTS GH VB

నిన్న మొన్నటి వరకు దోమలు తోలుకునేవాడు.. ఇప్పుడు ఫైవ్ స్టార్ సౌకర్యాలు.. ఎవరీయన..? ఏంటా కథ..

గ్రౌండ్స్‌మెన్

గ్రౌండ్స్‌మెన్

క్యాడ్‌బరీ కంపెనీ ముంబై వాంఖడే స్టేడియం గ్రౌండ్ సిబ్బందికి జీవితాంతం గుర్తుండిపోయే బహుమతి ఇచ్చింది. గ్రౌండ్స్‌మెన్ అందరికీ ఫైవ్ స్టార్ హోటల్‌లో వసతి కల్పించాలని కంపెనీ నిర్ణయించుకుంది.

క్యాడ్‌బరీ కంపెనీ(Company) ముంబై వాంఖడే స్టేడియం(Stadium) గ్రౌండ్ సిబ్బందికి జీవితాంతం గుర్తుండిపోయే బహుమతి ఇచ్చింది. గ్రౌండ్స్‌మెన్(Groundsmen) అందరికీ ఫైవ్ స్టార్ హోటల్‌లో(Five Star Hotel) వసతి కల్పించాలని కంపెనీ(Company) నిర్ణయించుకుంది. వారికి సెలబ్రిటీ డిజైనర్ మసాబా రూపొందించిన యూనిఫాంలు, ఆహారం, హోటల్ నుంచి గ్రౌండ్‌కి వచ్చి వెళ్లడానికి బస్సు కూడా ఏర్పాటు చేసింది. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో గ్రౌండ్ సిబ్బందిని క్యాడ్‌బరీ కంపెనీ గ్రాండ్‌గా సత్కరించింది. ఐపీఎల్‌ సీజన్ ప్రారంభానికి ముందు గ్రౌండ్‌ స్టాఫ్‌ని ఫైవ్ స్టార్ హోటల్‌లో ఉంచుతారని గుసగుసలు వచ్చాయని, అయితే తాను వాటిని నమ్మలేదని వాంఖడే గ్రౌండ్స్‌మెన్ వసంత్‌ చెప్పారు. ఒక రోజు MCA(ముంబై క్రికెట్ అసోసియేషన్) మాతో గ్రౌండ్‌ స్టాఫ్‌కు ఈ సీజన్‌కు సంబంధించిన వసతిని క్యాడ్‌బరీ కంపెనీ కల్పిస్తుందని చెప్పిందని, వచ్చే రెండు నెలల ఐపీఎల్‌ కోసం బట్టలు, ఆహారం ఇస్తుందని తెలిపిందని, అరేబియా సముద్రం మెరైన్ డ్రైవ్‌ పక్కనే ఉన్న విలాసవంతమైన హోటల్‌లో కుషన్‌పై కూర్చున్న వసంత్ గుర్తు చేసుకొన్నారు.

ఈ సందర్భంగా వసంత్‌ మాట్లాడుతూ.. ‘ఇంతకు ముందు మ్యాచ్‌లు జరిగే సమయంలో కష్టపడాల్సి వచ్చేది. మ్యాచ్‌లు తరచుగా ఆలస్యంగా ముగుస్తాయి. ఆ సమయంలో ఇంటికి తిరిగి రాలేని పరిస్థితులు ఉంటాయి. అందుకే స్టేడియంలోని విట్టల్ దివేచా స్టాండ్‌కి దిగువన ఉన్న చిన్న గదిలో దోమల మధ్యనే రాత్రంతా గడిపేవాళ్లం. మ్యాచ్ ముగిసిన తర్వాత రైలు సర్వీసులు కూడా ఆగిపోతాయి. ఎక్కడికీ వెళ్లలేం. మ్యాచ్‌ లేని రోజు ఉదయం 9 గంటలకు స్టేడియానికి చేరుకుని సాయంత్రం 6 గంటలకు తిరిగి బయలుదేరుతాం. కానీ మ్యాచ్ జరిగే రోజుల్లో ముందుగానే వస్తాం. ఎక్కువ సమయం పని చేసినందుకు రెట్టింపు మొత్తాన్ని MCA చెల్లిస్తుంది.’ అని చెప్పారు.

Techie Turns Delivery Agent: టీసీఎస్(TCS) లో ఉద్యోగం వదిలి.. జొమాటో డెలివరీ ఏజెంట్‌గా విధులు.. కారణం ఏంటి..?


ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో ఇప్పుడు వసంత్‌ భిన్నమైన ఆందోళనకు గురవుతున్నాడు. గదిలో లైట్‌ స్విచ్ తెలియక.. అలాగే పడుకుంటున్నట్లు తెలిపారు. బాగా నిద్ర పడుతోందని, పరుపు మెత్తగా ఉందని వివరించారు. మరో గ్రౌండ్స్‌మెన్ నితిన్ మోహితే మాట్లాడుతూ.. ‘డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లడం ఇప్పుడు భిన్నంగా ఉంది. మాకు మా సొంత బస్సు ఉంది. అది మమ్మల్ని హోటల్‌ నుంచి తీసుకొచ్చి వదిలివేస్తుంది. మా వద్ద మాటలు లేవు. ధన్యవాదాలు మాత్రమే చెప్పగలం,’ అని చెప్పారు.

రెండేళ్ల క్రితం మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ తనను కౌగిలించుకున్న తీరును వసంత్ గుర్తు చేసుకున్నారు. అండర్‌ 19 ఆడుతున్న రోజుల నుంచి కౌఫ్ తమకు సాయం చేస్తున్నాడని, తన గురించి కైఫ్ తోటి వ్యాఖ్యాతలకు చెప్పినప్పుడు ఆనందానికి అవధులు లేకుండా పోయాయని చెప్పారు. అయితే పాతతరం వారిలా ఇప్పుడున్న కొత్త ఆటగాళ్లు లేరని.. ఎప్పుడూ ఏదో లోకంలో బిజీగా ఉన్నట్లు కనిపిస్తారని చెప్పారు. 90ల నుంచి మ్యాచ్ రోజుల్లో డ్రెస్సింగ్ రూమ్ అటెండెంట్‌గా, ఆటగాళ్లకు, సహాయక సిబ్బందికి సేవ చేస్తూ, తువ్వాలు, సబ్బులు అందజేశానని వివరించారు. కొంతమంది దిగ్గజ ఆటగాళ్లను దగ్గరి నుంచి చూసే అదృష్టం తనకు కలిగిందని, సునీల్ గవాస్కర్ నుంచి పృథ్వీ షా వరకు సేవలు చేశానని, సచిన్ టెండూల్కర్ ఎదుగుదలని అలాగే వినోద్ కాంబ్లీ ఎదుగుదలని చేశానని వివరించారు.

‘ముంబై ఆటగాళ్లపై అతనికి ప్రత్యేక అభిమానం ఉందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారు వచ్చి నా హాల్-చాల్ (శ్రేయస్సు) గురించి అడుగుతారు. కాంబ్లీ, టెండూల్కర్, అజిత్ అగార్కర్ డ్రెస్సింగ్ రూమ్‌లో నాకు ఎప్పుడూ అసౌకర్యంగా అనిపించకుండా చూసేవారు. అమోల్ ముజుందార్ తన ఆటపై ఎంత మక్కువ చూపుతాడో నాకు తెలుసు. అతను బయటకు వచ్చినప్పుడల్లా చాలా బాధపడతాడు. ఎవరు నిరుత్సాహంగా కనిపించినా మరో గదిలోకి వెళ్లిపోయేవాడిని. ఆటగాళ్లు కోపంగా ఉండటం, సంతోషంగా ఉండటం చూశాను. టెండూల్కర్‌ ఏడ్చుకుంటూ తిరిగి వెళ్లడం కూడా చూశాను. అతను చివరి మ్యాచ్‌లో పిచ్‌ని తాకినప్పుడు నన్ను నేను నియంత్రించుకోలేకపోయాను. దాదాపు రెండు రోజులు ఆ బాధ నుంచి నేను బయటకు రాలేదు’ అని వసంత్‌ చెప్పారు.
Published by:Veera Babu
First published:

Tags: Cricket, India, IPL, Mumbai

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు