ఐపీఎల్ 2022 (IPL 2022) సీజన్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీజన్ మధ్యలోనే చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) కెప్టెన్ మారిపోయాడు. ఎంఎస్ ధోనీ మళ్లీ జట్టు పగ్గాలు చేపట్టాడు. కెప్టెన్సీని వదుకులున్న 37 రోజుల్లోనే తిరిగి చెన్నై జుట్టు కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ (MS Dhoni)అవతరించాడు. రవీంద్ర జడేజా (Ravindra Jadeja) తన ఆటపై ఎక్కువ దృష్టి పెట్టేందుకు కెప్టెన్సీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్య శనివారం సాయంత్రం పత్రికా ప్రకటన విడుదల చేసింది. ధోనీని చెన్నై జట్టు పగ్గాలు చేపట్టాలని అభ్యర్థించింది. జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఈ అభ్యర్థనను అంగీకరించిన మహేంద్ర సింగ్ ధోనీ.. చెన్నై జట్టు కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించాడు. ఇవాళ హైదరాబాద్‌తో జరగనున్న మ్యాచ్‌లోనే కెప్టెన్‌గా దిగనున్నాడు.
ఐతే జడేజా తన కెప్టెన్సీని ఎందుకు వదలుకున్నాడు. కేవలం 8 మ్యాచ్‌ల పాటు మాత్రమే ఎందకు పరిమితమయ్యాడు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. CSK మేనేజ్‌మెంట్‌తో పాటు ప్రమోటర్లు.. కెప్టెన్‌గా జడేజా ప్రదర్శనపై తీవ్రం అసంతృప్తిగా ఉన్నారని InsideSport తెలిపింది. జడేజా కెప్టెన్సీలో చెన్నై జట్టు ప్రదర్శన చెత్తగా ఉందని.. అందుకే కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో జడేజా తన కెప్టెన్సీని వదులుకున్నాడని తెలుస్తోంది. కెప్టెన్‌గా రవీంద్ర జడేజా గ్రౌండ్‌లో చాలా యాక్టివ్‌గా కనిపించడం లేదని.. అతడి కెప్టెన్సీలో కూడా పదును లేదని సీఎస్‌కే జట్టు ప్రతినిధుల్లో ఒకరు ఇన్‌సైడ్ స్పోర్స్‌తో అన్నారు. కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన సమయంలో కూడా అతడిలో ఆత్మ విశ్వాసం లేదని.. ఇది అతని బాడీ లాంగ్వేజ్‌లో కూడా కనిపించిందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అతడిని తప్పించారు.
చాలా మంది మాజీ క్రికెటర్లు కూడా జడేజా కెప్టెన్సీ గురించి ప్రశ్నలు లేవనెత్తారు. ఐపీఎల్ అద్భుతమైన జట్టుగా పేరున్న చెన్నైని.. జడేజా ముందుండి నడిపించగలడా? అని సందేహాలను వ్యక్తం చేశారు. కానీ చెన్నై జట్టులో ధోనీ తర్వాత జడేజానే సీనియర్. అంతేకాదు అత్యధికంగా డబ్బులు తీసుకుంటున్నది కూడా అతడే. జడేజాను చెన్నై జట్టు రూ.16 కోట్లకు రిటైన్ చేసుకుంది. ధోనీకి రూ.12 కోట్లు చెల్లిస్తుంది. వచ్చే సీజన్ నుంచి ధోనీ ఐపీఎల్ ఆడే అవకాశం లేనట్లు తెలుస్తోంది. అతడు వెళ్లిపోతే వేరొకరికి కెప్టెన్సీ ఇవ్వాలి. అందుకే ఈ సీజన్ నుంచే జడేజాకు అప్పగించి.. ధోనీ ఉన్న సమయంలోనే అతడి నుంచి కెప్టెన్సీ మెలకువలు నేర్చుకునే అవకాశం కల్పించింది. అందుకే ఐపీఎల్ ప్రారంభానికి రెండు రోజుల ముందు.. చెన్నై జట్టుకు జడేజాను కెప్టెన్‌గా ప్రకటించింది.
IPL 2022: రవీంద్ర జడేజా కీలక నిర్ణయం.. MS ధోనీకి CSK బాధ్యతలు..
కానీ యాజమాన్యం ఆశించిన స్థాయిలో జడేజా కెప్టెన్సీ లేదు. గ్రౌండ్‌లోనూ యాక్టివ్‌గా కనిపించడం లేదు. అంతేకాదు ఎమినిది మ్యాచ్‌లు ఆడితే.. కేవలం రెండింటిలోనే గెలిచింది. వ్యక్తిగతంగా జడేజా ప్రదర్శన కూడా అంతగా లేదు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ పెద్దగా ఆకట్టుకోలేదు . అటు కెప్టెన్‌గా..అటు ఆటగాడిగానూ విఫలమవుతుండడంతో.... జడేజాను కెప్టెన్సీ నుంచి తప్పించి.. ఒత్తిడిని తగ్గించింది సీఎస్‌కే యాజమాన్యం. ఇప్పుడు కనీసం ఆటగాడిగానైనా రాణిస్తాడని భావిస్తోంది. ఇక ధోనీకి పగ్గాలు అప్పగించడంతో..ఇక నుంచైనా మ్యాచ్‌లు గెలిచి.. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుందని ఆశిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chennai Super Kings, IPL 2022, MS Dhoni, Ravindra Jadeja