IPL CRICKET IPL 2022 BATSMAN FAILED IN FRONT OF SRH BOWLER UMRAN MALIK SPEED TOOK 5 WICKETS BY THROWING SUCH A FAST BALL SK
Umran Malik: అవి బాల్స్ కాదు బుల్లెట్స్.. ఉమ్రాన్ యార్కర్లకి ఎగిరిపోతున్న స్టంప్స్.. వీడియో
ఉమ్రాన్ మాలిక్
Umran Malik: నిన్న జరిగిన మ్యాచ్‌లో పలు రికార్డు సాధించాడు ఉమ్రాన్ మాలిక్. ఐపీఎల్లో తొలిసారి ఐదు వికెట్ల ఫీట్ సాధించిన ఐదో అన్క్యాప్డ్ ప్లేయర్‌గా నిలిచాడు. అంతేకాదు సన్‌రైజర్స్ తరపున ఐదు వికెట్ల ఫీట్ సాధించిన రెండో బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు.
Ipl 2022: నిన్న ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్ (Sunrisers Hyderabad)పై గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్ గెలిచింది. ఐతే ఈ మ్యాచ్‌లో గుజరాత్ గెలుపొందినా.. హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ (Umran Malik) మాత్రం అందరినీ ఆకర్షించాడు. అద్భుతమైన బౌలింగ్‌తో ఔరా అనిపించాడు. కళ్లు చెదిరేలా బంతులను విసురుతూ..కేక పెట్టించాడు. అవి బాల్స్ కాదు..బుల్లెట్స్ అనేలా..యార్కర్లు సంధించి.. ప్రత్యర్థి బ్యాట్స్మెన్లను ముప్పుతిప్పలు పెట్టాడు. మనోడి స్పీడ్‌కు స్టంప్స్ ఎగిరి.. గాల్లో పల్టీలు కొడుతున్నాయంటే..ఏ రేంజ్లో బౌలింగ్ వేస్తున్నాడో ఊహించుకోవచ్చు. ఈ మ్యాచ్‌లో ఉమ్రాన్ 4 ఓవర్లువేసి.. 25 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఈ సీజన్లో ఉమ్రాన్ మాలిక్ అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. మొదటి కొన్ని మ్యాచ్‌లలో కష్టపడాల్సి వచ్చినా.. ఆ తర్వాత పుంజుకున్నాడు. తన కోచ్ డెయిల్ స్టెయిన్ ట్రైనింగ్‌లో బాగా రాటుదేలాడు. అధిక వేగంతో.. లైన్ అండ్‌మి లెంగ్త్ మిస్ అవ్వకుండా.. వికెట్ టు వికెట్ బౌలింగ్ చేస్తూ.. అదరగొడుతున్నాడు. 'అత్యంత వేగవవతమైన బంతి' కింద.. ప్రతి మ్యాచ్‌లోనూ లక్ష గెలుచుకోవడమే కాదు.. కీలక సమయంలో వికెట్లు కూడా తీస్తున్నాడు ఉమ్రాన్ మాలిక్. గత నాలుగు మ్యాచ్‌ల్లో మొత్తం 12 వికెట్లు పడగొట్టాడు. అంటే మనోడు ఏ స్థాయిలో చెలరేగిపోతున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 15 వికెట్లు పడగొట్టి.. పర్పుల్ క్యాప్ రేస్‌లో ఉన్నాడు.
బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నలుగురు ఆటగాళ్లను క్లీన్ బౌల్డ్ చేశాడు ఉమ్రాన్ మాలిక్. తాను తీసిన మొత్తం 5 వికెట్లలో నాలుగు క్లీన్ బౌల్డ్లే ఉండడం విశేషం. వృద్ధిమాన్ సాహా 152.8 కి.మీ, డేవిడ్ మిల్లర్ 148.7 కి.మీ, అభినవ్ మనోహర్ 146.8, శుభ్‌మాన్ గిల్‌ను గంటకు 144.2 కి.మీ వేగంతో బౌల్డ్ చేశాడు. హార్దిక్ పాండ్యా క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. హార్దిక్‌ను ఔట్ చేసిన బంతి కూడా గంటకు 145.1 కి.మీ వేగంతో దూసుకెళ్లింది. ఇందులో సాహాను ఔట్ చేసిన విధానం.. మొత్తం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. భీకర ఫామ్‌లో కనిపించిన సాహాను అద్భుతమైన యార్కర్‌తో బోల్డ్ చేశాడు ఉమ్రాన్ మాలిక్. అతడు వేసిన బంతికి.. సాహా స్పందించే లోపే.. బాల్ వికెట్లను తాకింది. ఉమ్రాన్ నిన్నటి మ్యాచ్‌లో వికెట్లు తీసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
నిన్న జరిగిన మ్యాచ్‌లో పలు రికార్డు సాధించాడు ఉమ్రాన్ మాలిక్. ఐపీఎల్లో తొలిసారి ఐదు వికెట్ల ఫీట్ సాధించిన ఐదో అన్క్యాప్డ్ ప్లేయర్‌గా నిలిచాడు. అంతేకాదు సన్‌రైజర్స్ తరపున ఐదు వికెట్ల ఫీట్ సాధించిన రెండో బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఇక ఈ సీజన్లో ఒక బౌలర్ ఒకే మ్యాచ్‌లో నలుగురు బ్యాటర్లను క్లీన్ బోల్డ్ చేయడం ఇది మూడోసారి. ఉమ్రాన్ మాలిక్ వేగాన్ని చూసి సహచర ఆటగాళ్లు, మాజీలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కూడా ఫిదా అయ్యారు. ఇంగ్లండ్‌తో జరిగే ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఉమ్రాన్ మాలిక్‌ను భారత జట్టులో చేర్చాలని అభిప్రాయపడ్డారు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.