ZyCoV-D Vaccine: సూది లేకుండానే ఇంజెక్షన్... నొప్పి తెలియకుండా పిల్లలకు కరోనా టీకా

ప్రతీకాత్మక చిత్రం

ZyCoV-D Vaccine: జైడస్ క్యాడిలా వ్యాక్సీన్‌ను అన్ని వ్యాక్సీన్లలా ఇంజెక్షన్ రూపంలో కాకుండా.. పెయిన్ లెస్ ఇంట్రాడర్మల్ అప్లికేటర్ ద్వారా అందిస్తున్నారు. ‘‘సూది ఉండదు. కాబట్టిపిల్లలకు నొప్పి తెలియకుండా ఈ వ్యాక్సీన్ ఇవ్వొచ్చు.

  • Share this:
జైడస్ క్యాడిలా సంస్థ తయారు చేసినజైకోవ్ డి కోవిడ్​ వ్యాక్సిన్​ ఎమర్జెన్సీ వినియోగానికి భారత్​ గ్రీన్​సిగ్నల్​ ఇచ్చింది. భారత్​లోనే తయారైన ఈ వ్యాక్సీన్​కి డ్రగ్ రెగ్యులేటర్ నుంచి ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ (EUA) అన్ని అనుమతులు ఇచ్చింది. ఈ వ్యాక్సిన్​ను పెద్దలకే కాదు12 నుంచి 18 సంవత్సరాల మధ్య గల పిల్లలపై ప్రయోగించనుంది. దీంతో,పిల్లల కోసం అందుబాటులోకి వచ్చినమొట్టమొదటి వ్యాక్సిన్​గా దీన్నిచెప్పుకోవచ్చు. ఈ వ్యాక్సీన్ ఉత్పత్తిని ఒక అద్భుతమైన అంశంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ వ్యాక్సిన్​ ద్వారా దేశంకరోనాతో పూర్తి స్థాయిలో పోరాడుతోందని ప్రకటించారు.కాగా, భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసిన కోవాగ్జిన్, జైడస్ క్యాడిలా ఉత్పత్తి చేసినజైకోవ్ డి ఈ రెండు వ్యాక్సీన్లు మాత్రమే భారత్​లో పిల్లలపై ప్రయోగాలు చేస్తున్నాయి. భారత్​లోతయారుచేసిన రెండో వ్యాక్సీన్ ఇది. అంతేకాదు.. భారత్ బయోటెక్ కోవాగ్జిన్ తర్వాత ఎమర్జెన్సీ ఆథరైజేషన్ పొందిన రెండో వ్యాక్సీన్ కూడా ఇదే కావడం విశేషం.

ఎవరు తీసుకోవచ్చంటే..
ఈ వ్యాక్సీన్ ని పెద్దలు, పన్నెండు సంవత్సరాల కంటే పెద్ద పిల్లలు తీసుకోవచ్చు. జైకోవ్ డి కోవిడ్ 19 వైరస్ లోని జెనెటిక్ మెటీరియల్ ని డీఎన్ ఏ లేదా ఆర్ ఎన్ ఏ రూపంలో ఉపయోగించి ఒక ప్రత్యేకమైన ప్రొటీన్ ని తయారుచేసి మనిషిలోని రోగ నిరోధక వ్యవస్థను పెంచుతుంది. ఈ జైకోవ్ డి వ్యాక్సీన్ మూడు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి కరోనా వైరస్ అయిన SARS-CoV-2 స్పైక్ ప్రొటీన్ కి వ్యతిరేకంగా రోగ నిరోధక శక్తి పనిచేసేలా చేస్తుంది. మొదటి డోసు తీసుకున్న తర్వాత 28 రోజులకు రెండో డోస్ ఆ తర్వాత 56వ రోజు మూడో డోస్ తీసుకోవాల్సి ఉంటుంది.

నీడిల్ లెస్ వ్యాక్సీనా?
జైడస్ క్యాడిలా వ్యాక్సీన్‌ను అన్ని వ్యాక్సీన్లలా ఇంజెక్షన్ రూపంలో కాకుండా.. పెయిన్ లెస్ ఇంట్రాడర్మల్ అప్లికేటర్ ద్వారా అందిస్తున్నారు. ‘‘సూది ఉండదు. కాబట్టిపిల్లలకు నొప్పి తెలియకుండా ఈ వ్యాక్సీన్ ఇవ్వొచ్చు.2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ మధ్యలో దీన్ని నిల్వ చేయాల్సి ఉంటుంది.ఈ వ్యాక్సీన్ ధర ఇంకా నిర్ణయించలేదు. అయితే జైడస్ గ్రూప్ ఎండీ శార్విల్ పటేల్ ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం. రెండు వారాల్లో ఓ క్లారిటీ లభిస్తుంది. అందుకే మేం ప్రస్తుతం తక్కువ సంఖ్యలోనే శాంపిల్స్ తయారుచేస్తున్నాం.’’ అని కంపెనీ ప్రతినిధి వెల్లడించారు.

ఎప్పుడు అందుబాటులోకి వస్తుందంటే..
జైడస్ క్యాడిలా సంస్థ సంవత్సరానికి 10 నుంచి 12 కోట్ల మేర వ్యాక్సీన్లు సిద్ధం చేయనున్నామని ప్రకటించింది. కేంద్ర ఆరోగ్య శాఖ మే 13న ప్రకటించిన వివరాలప్రకారం ఆగస్టు నుంచి డిసెంబర్ లోపల 216 కోట్ల వ్యాక్సీన్ డోసులు సిద్ధమవుతాయని ప్రకటించింది. ఇందులో కేవలం జైడస్ క్యాడిలా డోసులు మాత్రమే లెక్కిస్తే ఐదు కోట్ల డోసులు ఉంటాయి. అంతే కాదు.. 28 వేల మంది వాలంటీర్లపై చేసిన అధ్యయనంలో డెల్టా వేరియంట్ పై 66.6 శాతం ఎఫిషియంట్ గా ఉంటుందని తేలిందట. ఇది కొత్త వైరస్ స్ట్రెయిన్లపై కూడా ప్రభావవంతంగా పనిచేస్తుందని పరిశోధనల్లో తేలింది.
Published by:Shiva Kumar Addula
First published: