Conona Vaccine: రెండో స్వదేశీ కరోనా వాక్సిన్‌ హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభం

అహ్మదాబాద్‌లోని వాక్సిన్ టెక్నాలజీ సెంటర్‌లో జై కోవ్-డీ వాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్లు ఈ నెల ప్రారంభంలో జైడుస్ కంపెనీ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రి-క్లినికల్ దశలో ఎలుకలు, కుందేళ్లు ,పందులపై వీటిని ప్రయోగించగా.. మెరుగైన ఫలితాలు వచ్చాయని వెల్లడించింది.

news18-telugu
Updated: July 15, 2020, 1:00 PM IST
Conona Vaccine: రెండో స్వదేశీ కరోనా వాక్సిన్‌ హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభం
ప్రతీకాత్మక చిత్రం (credit - twitter - reuters)
  • Share this:
భారత్‌లో కరోనా వాక్సిన్ అభివృద్ధి దిశగా మరో కీలక అడుగు ముందుకు పడింది. ఇప్పటికే తొలి స్వదేశీ వాక్సిన్ 'కొవాగ్జిన్' ట్రయల్స్‌ను భారత్ బయోటెక్ కంపెనీ ప్రారంభించింది. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా పలు చోట్ల హ్యూమన్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇక రెండో స్వదేశీ వాక్సిన్ జై కోవ్-డీ (ZyCoV-D) ఔషధ ప్రయోగాలు కూడా ప్రారంభమ్యాయి. మొదటి, రెండో దశ వాక్సిన్ ట్రయల్స్‌లో భాగంగా ఆరోగ్యవంతమైన వాలంటీర్లపై వాక్సిన్ ఇస్తున్నామని, దాన్ని తయారుచేసిన కంపెనీ జైడుస్ క్యాడిలా (Zydus Cadila) కంపెనీ వెల్లడించింది.

క్లినికల్ ట్రయల్ రిజిస్ట్రీ ఆఫ్ ఇండియా (CTRI) జూలై 4 నాటి డేటా ప్రకారం... వాక్సిన్ సురక్షితమైనదా? కదా? అని తెలుసుకునేందుకు ఫేజ్-1 ట్రయల్స్ చేస్తారు. ఇది పూర్తవడానికి 84 రోజులు సమయం పడుతుంది. అది సురక్షితమే అని తేలితే.. కరోనాపై ఏ మేర ప్రభావం చూపుతుంది? దాని సామర్థ్యమేంటి? అని తెలుసుకునేందుకు ఫేజ్-2 ట్రయల్స్ చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తవడానికి కూడా 84 రోజులు సమయం పడుతుంది. అంటే ఈ రెండు పూర్తవడానికే దాదాపు 6 నెలల సమయం పడుతుందన్న మాట.

అహ్మదాబాద్‌లోని వాక్సిన్ టెక్నాలజీ సెంటర్‌లో జై కోవ్-డీ వాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్లు ఈ నెల ప్రారంభంలో జైడుస్ కంపెనీ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రి-క్లినికల్ దశలో ఎలుకలు, కుందేళ్లు పందులపై వీటిని ప్రయోగించగా.. మెరుగైన ఫలితాలు వచ్చాయని వెల్లడించింది. ఈ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత బలమైన వ్యాధి నిరోధక ప్రతిస్పందన వచ్చిందని జైడుస్ ప్రతినిధులు చెప్పారు. ఈ క్రమంలోనే మనుషులపై ప్రయోగాలు చేసేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) అనుమతి ఇచ్చింది. కాగా, ఐసీఎంఆర్, ఎన్ఐవీ సహకారంతో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ హ్యూమన్ ట్రయల్స్ కూడా ఇప్పటికే ప్రారంభమైన విషయం తెలిసిందే.
Published by: Shiva Kumar Addula
First published: July 15, 2020, 12:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading