Home /News /coronavirus-latest-news /

ZIKA VIRUS CASES INCRESING RAPIDLY IN UTTAR PRADESH GOVT STARTED TRACE AND TREAT METHOD EVK

Zika Virus : ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ పెరుగుతున్న జికా వైర‌స్ కేసులు.. సీఎం స‌మీక్ష‌

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

Zika Virus : ఇప్పుడిప్పుడే క‌రోనా ప్ర‌భావం నుంచి దేశం బ‌య‌ట‌ప‌డుతోంది. ఈ స‌మ‌యంలో కొత్త‌గా జికా వైర‌స్ (Zika Virus) వ్యాప్తి చెందుతుందా అనే ఆందోళ‌న ప్ర‌జ‌ల్లో క‌లుగుతోంది. ప్ర‌స్తుతం ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లో కొత్త‌గా 13 జికా వైర‌స్ కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 89 జికా కేసులు న‌మోదైన‌ట్లు అధికారిక వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

ఇంకా చదవండి ...
    ఇప్పుడిప్పుడే క‌రోనా ప్ర‌భావం నుంచి దేశం బ‌య‌ట‌ప‌డుతోంది. ఈ స‌మ‌యంలో కొత్త‌గా జికా వైర‌స్ (Zika Virus) వ్యాప్తి చెందుతుందా అనే ఆందోళ‌న ప్ర‌జ‌ల్లో క‌లుగుతోంది. ప్ర‌స్తుతం ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లో కొత్త‌గా 13 జికా వైర‌స్ కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 89 జికా కేసులు న‌మోదైన‌ట్లు అధికారిక వ‌ర్గాలు వెల్ల‌డించాయి.  ఆదివారం ఒక్క రోజే 10 కేసులు న‌మోద‌య్యాయి. అత్య‌ధికంగా కాన్పూర్ ప్రాంతంలో కేసులు సంఖ్య పెరుగుతుండ‌డంతో ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ (Uttar Pradesh)  సీఎం యోగీ ఆదిత్యానాథ్ అధికారుల‌తో ఉన్న‌త స్థాయి స‌మీక్ష నిర్వ‌హించారు. శ‌ర‌వేగంగా వ్యాప్తి నియంత్ర‌ణ‌కు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని క్షేత్ర‌స్థాయి అధిఆరుల‌ను ఆదేశించారు.

    ఎలా ప్రారంభమైంది..
    కాన్పూర్‌లో అక్టోబర్ 24న తొలి జికా కేసు నమోదైంది. వాయుసేనలో పనిచేసే ఓ
    అధికారి కొన్ని రోజులుగా జ్వ రంతో బాధపడుతూ వాయుసేన ఆస్పత్రిలో చేరారు. ఆయన వద్ద నుంచి సేకరించిన నమూనాలను పుణెలోని ప్రయోగశాలకు పంపించారు. అనూహ్యంగా ఆయ‌న ర‌క్త‌న‌మూనాల్లో జికా వైరస్‌ బారినపడినట్లు తేలింది.

    Covid 19 Vaccination : పిల్ల టీకా వ‌చ్చేసింది.. సూది అవ‌స‌రం లేదు.. ధ‌ర ఎంతో తెలుసా?


    దీంతో వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన వైద్యాధికారులు బాధితుడితో సన్నిహితంగా ఉన్న మ‌రో 22 మందిని గుర్తించారు. అనంత‌రం చ‌ర్య‌లు చేప‌డుతున్న‌ప్ప‌టికీ కేసుల సంఖ్య మాత్రం త‌గ్గ‌డం లేదు.

    ఢిల్లీకి పొంచి ఉన్న ముప్పు..
    ఉత్త‌ర్ ప్ర‌దేశ్ అతి పెద్ద‌ రాష్ట్రం కావ‌డంతో జ‌నాభా ఎక్కువ‌గా ఉండ‌డంతో వ్యాధి వేగంగా వ్యాప్తి చెందే అవ‌కాశం ఉంది. అయితే స‌మీపంలో దేశ రాజ‌ధాని ఢిల్లీ (Delhi) ఉండ‌డంతో వ్యాధి ప్ర‌బ‌లి ఢిల్లీకి విస్త‌రిస్తే ప్ర‌మ‌దామ‌ని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్ప‌టికే వాతావ‌ర‌ణ కాలుష్యంతో అత‌లాకుత‌లం అవుతున్న ఢిల్లీ మ‌ళ్లీ వైర‌స్ వ్యాప్తి ప్రారంభం అయితే వేగంగా విస్త‌రించే అవ‌కాశం ఉందని వైద్య బృందాలు చెబుతున్నాయి. అయితే ప‌రిస్థ‌తి చేయిదాట‌కుండా ఇప్ప‌టే ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మై వ్యాధి సోకిన వారిని గుర్తించే ప‌నిని శ‌ర‌వేగంగా పూర్తి చేస్తోంది.

    భారత్‌లో గడిచిన 24 గంటల్లో 10,853 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్త కేసుల సంఖ్య 260 రోజుల కనిష్టానికి చేరుకుంది. 12,432 మంది కోవిడ్ మహమ్మారి నుంచి సంపూర్ణంగా కోలుకున్నారు. నిన్న దేశవ్యాప్తంగా 526 మరణాలు నమోదయ్యాయి. ఐతే వీరంతా నిన్న ఒక్కరోజే మరణించలేదు. కేరళ మరణాలను సవరించడంతో మరణాల సంఖ్య పెరిగింది.

    తాజా కేసులతో కలిపి దేశంలో నమోదైన మొత్త కరోనా కేసుల సంఖ్య 3,43,55,536 కి చేరింది. వీరిలో ఇప్పటి వరకు 3,37,49,900 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి 4,60,791 మంది మరణించారు. ప్రస్తుతం ఇండియాలో 1,44,845 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Corona, Uttar pradesh, Zika Virus

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు