Home /News /coronavirus-latest-news /

ZIKA VIRUS CASES ARE INCREASING IN UTTARPRADESH GOVT STARTED TRACE AND TREAT METHOD EVK

Zika Virus : ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లో పెరుగుతున్న జికా వైర‌స్ కేసులు.. ఇప్ప‌టి దాకా 79మందికి వ్యాప్తి

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ఇప్పుడిప్పుడే క‌రోనా ప్ర‌భావం నుంచి దేశం బ‌య‌ట‌ప‌డుతోంది. ఈ స‌మ‌యంలో కొత్త‌గా జికా  వైర‌స్ (Zika Virus) వ్యాప్తి చెందుతుందా అనే ఆందోళ‌న ప్ర‌జ‌ల్లో క‌లుగుతోంది. ప్ర‌స్తుతం ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లో కొత్త‌గా 13 జికా వైర‌స్ కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 79 జికా కేసులు న‌మోదైన‌ట్లు అధికారిక వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

ఇంకా చదవండి ...
    ఇప్పుడిప్పుడే క‌రోనా ప్ర‌భావం నుంచి దేశం బ‌య‌ట‌ప‌డుతోంది. ఈ స‌మ‌యంలో కొత్త‌గా జికా  వైర‌స్ (Zika Virus) వ్యాప్తి చెందుతుందా అనే ఆందోళ‌న ప్ర‌జ‌ల్లో క‌లుగుతోంది. ప్ర‌స్తుతం ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లో కొత్త‌గా 13 జికా వైర‌స్ కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 79 జికా కేసులు న‌మోదైన‌ట్లు అధికారిక వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ముఖ్యంగా కాన్పూర్ జిల్లాలో వైర‌స్ వ్యాప్తి ఎక్కువ‌గా ఉన్న‌ట్టు వైద్య అధికార బృందం గుర్తించింది. దీంతో వ్యాప్తి క‌ట్ట‌డికి వేగంగా చ‌ర్య‌లు చేప‌ట్టెందుకు కృషి చేస్తోంది. వ్యాధి సోకిన వారితో ద‌గ్గ‌ర‌గా ఎవ‌రు ఉన్నారు అని గుర్తించే ప‌నిలో ప‌డింది. ఏదైమైన జికా వైర‌స్ పెరుగుద‌ల అక్క‌డి ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న క‌లిగిస్తోంది.

    క‌ట్ట‌డికి చ‌ర్య‌లు..
    కేసులు పెరుగుతండ‌డంతో ప్ర‌భుత్వం కోవిడ్ వ్యాప్తి క‌ట్ట‌డికి చర్య‌లు చేప‌ట్టింది. ఇప్ప‌టికే ఆశా కార్య‌క‌ర్త‌లు ఇంటింటికీ వెళ్లి వ్యాధి ల‌క్ష‌ణాలు ఉన్న వారిని గుర్తించే ప‌నిలో ప‌డ్డారు. జిల్లాలో మొత్తం 150 బృందాలు శానిటైజేషన్, ఫాగింగ్ చేస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.

    Covid 19 Cases : పెరుగుతున్న కేసులు.. జ‌ర్మ‌నీ, న్యూజిలాండ్‌లో ఆంక్ష‌లు


    ఢిల్లీకి పొంచి ఉన్న ముప్పు..
    ఉత్త‌ర్ ప్ర‌దేశ్ అతి పెద్ద‌ రాష్ట్రం కావ‌డంతో జ‌నాభా ఎక్కువ‌గా ఉండ‌డంతో వ్యాధి వేగంగా వ్యాప్తి చెందే అవ‌కాశం ఉంది. అయితే స‌మీపంలో దేశ రాజ‌ధాని ఢిల్లీ ఉండ‌డంతో వ్యాధి ప్ర‌బ‌లి ఢిల్లీకి విస్త‌రిస్తే ప్ర‌మ‌దామ‌ని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్ప‌టికే వాతావ‌ర‌ణ కాలుష్యంతో అత‌లాకుత‌లం అవుతున్న ఢిల్లీ మ‌ళ్లీ వైర‌స్ వ్యాప్తి ప్రారంభం అయితే వేగంగా విస్త‌రించే అవ‌కాశం ఉందని వైద్య బృందాలు చెబుతున్నాయి. అయితే ప‌రిస్థ‌తి చేయిదాట‌కుండా ఇప్ప‌టే ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మై వ్యాధి సోకిన వారిని గుర్తించే ప‌నిని శ‌ర‌వేగంగా పూర్తి చేస్తోంది.

    జ‌ర్మ‌నీ, న్యూజిలాండ్‌ల‌లో డెల్టా ప్ర‌భావం
    క‌రోనా (Corona) క‌ట్ట‌డిలో ప్రారంభ ద‌శ‌లో ఎంతో బాగా క‌ట్ట‌డి చేసిన దేశాలు ఇప్పుడు క‌రోనా దెబ్బ‌కు విల‌విల లాడుతున్నాయి. న్యూజిలాండ్, జ‌ర్మ‌నీ (Germany) దేశాల్లో రోజురోజుకు క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా న్యూజిలాండ్‌ (New Zealand) లో డెల్టా వేరియంట్ విజృభిస్తుంది. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 206 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో అధికంగా అక్లాండ్లో 200 కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఆ దేశ ప్ర‌భుత్వం ఆ న‌గ‌రంలో కోవిడ్ 19 (Covid 19) ఆంక్ష‌ల‌ను విధించాయి. న్యూజిలాండ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 12 ఏళ్ల పైన ఉన్న వారికి 78శాతం మంది పూర్తి టీకా తీసుకొన్నారు. మొద‌టి డోస్ (First Dose) తీసుకొన్న వారు 89శాతం మంది ఉన్నారు. అయినా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Covid -19 pandemic, Uttar pradesh, Zika Virus

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు