హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

కరోనాపై పోరాటానికి టీఆర్ఎస్ ఎంపీ సాయం రూ.1,01,00,000

కరోనాపై పోరాటానికి టీఆర్ఎస్ ఎంపీ సాయం రూ.1,01,00,000

జహీరాబాద్- బీబీ పాటిల్

జహీరాబాద్- బీబీ పాటిల్

జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ తన ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ.కోటి నిధులను కరోనా వైరస్ సహాయక చర్యల కోసం వినియోగించాలని లేఖ రాశారు.

కరోనా వైరస్ మీద పోరాటానికి టీఆర్ఎస్ నేత, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ముందుకొచ్చారు. తన ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.1,01,00,000 కేటాయించారు. బీబీ పాటిల్ నియోజకవర్గం జహీరాబాద్ రెండు జిల్లాల్లో (సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలు) విస్తరించి ఉంది. జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉండే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మూడు (జహీరాబాద్, ఆందోల్, నారాయణ ఖేడ్) సంగారెడ్డి జిల్లాలో ఉంటాయి. మరో నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లు (కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ) కామారెడ్డి జిల్లా పరిధిలోకి వస్తాయి. దీంతో సంగారెడ్డి జిల్లాలో ఉన్న మూడు నియోజకవర్గాలకు రూ.50లక్షలు, కామారెడ్డి జిల్లాలో ఉన్న 4 అసెంబ్లీ సెగ్మెంట్లకు రూ.51 లక్షలు కేటాయించారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో కరోనా వైరస్ నివారణ పరికరాలు, మందుల కొనుగోలు కోసం ఆ నిధులను వినియోగించాలంటూ రెండు జిల్లాల కలెక్టర్‌కు లేఖ రాశారు.

సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లకు బీబీ పాటిల్ రాసిన లేఖ

తెలంగాణలో కరోనా వైరస్ విస్తరిస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు. రాష్ట్రంలో కూడా దీన్ని పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించారు. ప్రజలు రోడ్ల మీద తిరిగితే పోలీసులు వారి మీద లాఠీలు ఝళిపిస్తున్నారు.

First published:

Tags: Coronavirus, Telangana, Trs, Zahirabad S29p05

ఉత్తమ కథలు