వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్... చెన్నై అపోలోలో చేరిక...

ఇన్నాళ్లూ సామాన్య ప్రజలకే సోకుతున్న కరోనా వైరస్... ఇప్పుడు ప్రజా ప్రతినిధులకూ అంటుకుంటోంది. ఐతే... చాలా మంది త్వరగానే కోలుకుంటున్నారు.

news18-telugu
Updated: July 14, 2020, 10:00 AM IST
వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్... చెన్నై అపోలోలో చేరిక...
వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్... చెన్నై అపోలోలో చేరిక...
  • Share this:
నెల్లూరు జిల్లా.... వైసీపీ సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్యకు అనారోగ్యంగా అనిపించడంతో... కరోనా శాంపిల్ టెస్ట్ చేయించుకోగా... కరోనా పాజిటివ్ అని తేలింది. వెంటనే ఆయన... చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు కరోనా లక్షణాలు చాలా తక్కువగానే ఉన్నట్లు తెలిసింది. ఏపీలో ఈమధ్య కరోనా పాజిటివ్ కేసులు బాగా పెరిగిపోతున్నాయి. మరణాల రేటు కూడా ఎక్కువగానే ఉంటోంది. అందువల్ల కరోనా బారిన పడుతున్న ప్రజా ప్రతినిధుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటికే నెల్లూరు నగరంలో పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది కరోనా బారిన పడ్డారు. వెంకటగిరిలో ఓ పోలీస్ స్టేషన్‌కూడా కరోనా వైరస్ కారణంగా మూసివేశారు. కరోనా మహమ్మారి తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా పాకింది. టీటీడీ సిబ్బందిలో తాజాగా 80 మంది కరోనా బారినపడినట్టు కలెక్టర్ ఎన్.గుప్తా తెలిపారు.

ఏపీలో కొత్తగా 1935 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 31,103కి చేరింది. తాజాగా 1030 మంది డిశ్చార్జి కాగా... ఇప్పటివరకూ 16,464 మంది డిశ్చార్జి అయ్యారు. తాజాగా 37 మంది మరణించారు. అనంతపూర్‌లో ఆరుగురు, కర్నూలులో నలుగురు, తూర్పు గోదావరిలో నలుగురు, పశ్చిమ గోదావరిలో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, గుంటూరులో ముగ్గురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, కడపలో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, శ్రీకాకుళంలో ఒకరు, విశాఖపట్టణంలో ఒకరు, విజయనగరంలో ఒకరు చనిపోయారు. ఇప్పటి వరకు 365 మంది మరణించారు. ప్రస్తుతం ఏపీలో 14,274 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
Published by: Krishna Kumar N
First published: July 14, 2020, 10:00 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading